Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

TANA జాతీయ టేబుల్ టెన్నిస్&బాడ్మింటన్ పోటీలు... విజేతలకు బహుమతులు...

Advertiesment
TANA Sports Event
, గురువారం, 21 మే 2015 (20:53 IST)
జూలై నెలలో 2-4 న డిట్రాయిట్‌లో జరగనున్ను 20వ TANA మహాసభలను పురస్కరించుకుని అమెరికా TANA జాతీయ టేబుల్ టెన్నిస్&బాడ్మింటన్ క్రీడల పోటీలను డిట్రాయిట్‌లో ఈ నెల 9వ తేదీన ఏర్పాటు చేసారు. ఈ క్రీడల పోటీలలో కెనడాకు చెందిన క్రీడాకారులు షటిల్ బ్యాడ్మింటన్ మరియు టేబుల్ టెన్నిస్‌లో విజేతలుగా నిలిచారు. నోర్త్విల్ల్ హిల్ సైడ్ మిడిల్ స్కూల్లో జరిగిన ఈ పోటీలలో 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. 
 
తానా మహాసభల కన్వీనర్ నాదెండ్ల గంగాధర్ , DTA అధ్యక్షులు శ్రీనివాస్ గోనుగుంట్ల, మహాసభల కార్యదర్శి శ్రీనివాస్ గోగినేని, రీజినల్ కో-ఆర్డినేటర్ జోగేశ్వరరావు పెద్దిబోయిన, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ విజయ్ రావు, కమిటీ అడ్వైజర్ రఘు రావిపాటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తానా, డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ పోటీలలో క్రీడాకారులు, స్థానికుల నుండి అపూర్వ స్పందన లభించింది.
webdunia
 
టేబుల్ టెన్నిస్ ఫైనల్స్ ఉత్కంఠభరితంగా నువ్వా నేనా అన్నట్లు జరిగింది. ఉదయం నుండి సాయత్రం వరకు జరిగిన పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. టేబుల్ టెన్నిస్ విభాగంలో కెనడాకు చెందిన విలాస్ సామినేని, వెంకటేష్ బొమ్మసంద్ర విజేతలుగా, మిచిగాన్‌కు చెందిన దీనదయాల్ మంత్రిప్రగడ, హర్షిని బీరపు రన్నర్స్‌గా గెలుపొందారు. పిల్లల విభాగంలో త్రిశూల్ కాలపురం, వివేక్ చినిమిల్లి విన్నర్స్‌గా, రన్నర్స్‌గా అమిత్ ఇవటూరి, రికిన్ అంకం నిలిచారు.
webdunia
  
విజేతలందరికి అదే సాయంత్రం సెయింట్ తోమ చర్చలో తానా సభల కన్వీనర్ గంగాధర్ నాదెండ్ల అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో దాతలు, ఇండియా నుండి వచ్చిన అతిథులచే ట్రోఫిలు, నగదు బహుమతిని అందచేసారు. డిట్రాయిట్లో జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఆటల పోటీలు స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ విజయ్ రావు, కమిటీ అడ్వైజర్ రఘు రావిపాటి, చందు అన్నవరపు, దివాకర్ దొడ్డపనేని, రవి కారణం, శ్రీకర్ పరుచూరి, వెంకట్ అడపా ఎంతో శ్రమించి విజయవంతం చేసారు.

Share this Story:

Follow Webdunia telugu