Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'తానా' సేవా కార్యక్రమాలు... తానా ఫౌండేషన్ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి సేవలు...

Advertiesment
TANA Foundation Chairman talluri jayasekhar
, బుధవారం, 1 జులై 2015 (20:43 IST)
తానాలో ఒక విభాగమైన తానా ఫౌండేషన్ తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించే కార్యక్రమాలతో పాటు, వదాన్యుల నుండి విరాళాలు సేకరించి భారత - అమెరికాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. గత నాలుగు దశాబ్దాలుగా తానా ఫౌండేషన్ తెలుగు జాతి గర్వించే విధంగా 40 మిలియన్ డాలర్లతో అనేక సేవా, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించింది. తెలుగు వారి సామాజిక అవసరాలను గుర్తించి గుంటూరులో శంకర్ నేత్ర చికిత్సాలయం, బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఇనిస్టిట్యూట్, విజయవాడ చైల్డ్ రెస్క్యూ సెంటర్, హైదరాబాద్ సెంటర్ ఫర్ సోషల్ సర్వీసెస్‌కు మూలధనం అందజేసి సేవా కార్యక్రమాలకు తానా ఫౌండేషన్ ముందు వరసలో నిలిచింది. అనేక పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల నిర్మాణానికి ఆర్థిక వనరులను ఫౌండేషన్ అందించింది.
   
ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మభూమి కార్యక్రమానికిగాను, అమెరికాలోని ప్రవాసాంధ్రులను చైతన్యపరచి విరాళాలు సమకూర్చి తమ స్వంత గ్రామాలలో ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రభుత్వానికి సహకరించి 100 కోట్ల కార్యక్రమాలు నిర్వహించింది. పాఠశాలల విద్యార్థులకు ఆత్మస్థైర్యం పెంచే విధంగా బేసిక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఉపకార వేతనాలు, పుస్తకాలు అందించడం వల్ల వేలాది విద్యార్థులు ప్రయోజనాన్ని పొందగలుగుతున్నారు. ప్రతి సంవత్సరం 175 మందికి 15000 రూపాయలు ఉపకార వేతనాలు అందచేస్తున్నారు . కేవలం 1500 డాలర్ల వ్యయంతో కేన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తూ శాశ్వత ప్రాతిపదికతో మాతృదేశంలో ఉపాధితో, స్థిరపడిన దేశంలో అవసరమైన విశిష్ట సేవలందిస్తున్న అంతర్జాతీయ సేవాసంస్థ తానా ఫౌండేషన్.  
 
తానా ఫౌండేషన్ అధ్యక్షులుగా ఉన్న శ్రీ జయశేఖర్ తాళ్ళూరి తెలంగాణా రాష్ట్రంలోని భద్రాచలంలో జన్మించారు. మెకానికల్ ఇంజనీర్ అయిన శ్రీ తాళ్ళూరి, అమెరికాలో న్యూయార్క్‌లో స్థిరపడి అనేక సాఫ్ట్వేరు కంపెనీలకు అధిపతిగా ఎదిగి తానా ఫౌండేషన్‌లో కార్యదర్శిగా, అధ్యక్షులుగా, విశిష్ట సేవలందిస్తున్నారు. 12 మంది సభ్యులున్న ఫౌండేషన్ ఈ రెండు సంవత్సరాలలో శ్రీజయశేఖర్ తాళ్ళూరి చైర్మన్‌గా 2014 లో 25 కేన్సర్ డిటెక్షన్ శిబిరాలు నిర్వహించి, 20 వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఫౌండేషన్ 40 మంది చిన్నారులకు గ్రహణంమొర్రి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం సమకూర్చే "వారధి" కార్యక్రమం మంచి గుర్తింపు పొందింది.
 
మనసు నుండి పుట్టిన సేవాభావన, ఆలోచనలు, అవకాశాలు ఎవ్వరినైనా ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయని పెద్దలు చెబుతారు. ఫౌండేషన్ చైర్మన్ శ్రీ తాళ్ళూరి జయశేఖర్ గారి కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే వీరి తండ్రి, తాతల నుండి, ఇతరులకు సేవలందించడంలో తమవంతు కృషిని సలిపినవారే. వీరు, వీరి కుటుంబ సభ్యులు "తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్" ద్వారా ప్రతీ సంవత్సరం 150 మంది విద్యార్థులు చదువులు కొనసాగించడానికి సంపూర్ణ ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
  
అవకాశాలు మనుషులను ఉన్నతులుగా తీర్చిదిద్దగలిగే సోపానాలు అని నానుడి. వృత్తిపరంగా అభివృధ్ధి చెందడం, కుటుంబంతో పాటు ఇతరులకు సహాయపడటం, సేవలందించడం ఎంతో సంతృప్తినిస్తుందని తానా ఫౌండేషన్లో పనిచెయ్యడం గర్వకారణం అని వీరి భావన. తానా ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులకు, సహకరించిన స్వచ్చంద కార్యకర్తలకు, తానా కార్యవర్గానికి కృతజ్ఞతలు. 20వ తానా మహా సభల సందర్భంగా తానా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ జయశేఖర్ తాళ్ళూరి గారు తెలుగు వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu