లండన్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం...
లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరం, JET UK సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. 800 మంది భక్తులు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, శాంతి మంత్రంతో ప్రారంభించి, ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకిలో శ్రీ రాముల వారి
లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరం, JET UK సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. 800 మంది భక్తులు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, శాంతి మంత్రంతో ప్రారంభించి, ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకిలో శ్రీ రాముల వారిని, సీతమ్మ వారిని తీసుకు వచ్చి కళ్యాణం ప్రారంభించారు.
లండన్‌లో మొదటిసారిగా 80 కుటుంబాలు స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు. శ్రీ త్రిదండి చిన్నజీయర్ గారి మఠం నుండి వచ్చిన శ్రీ రామాచార్య అయ్యగారి ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. కల్యాణానంతరం అన్నమాచర్య కీర్తనలు, భక్తి పాటలు సాంప్రదాయక నృత్యాలు, రామాయణంపై క్విజ్ పోటీలు, చిన్నారుల ఆట, పాటలతో ఘనంగా నిర్వహించారు.
భారత సంతతికి చెందిన లండన్ MP సీమా మల్హోత్రా గారు స్వామివారి కళ్యాణంలో పాల్గొని తమను కళ్యాణంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదము తెలిపారు. భగవాన్ శ్రీ రామానుజాచార్య 1000వ జయంతి ఉత్సవాలపై ప్రజెంటేషన్ ఇచ్చి భగవాన్ శ్రీ రామానుజాచార్య చరిత్రను తెలిపారు. శ్రీ సీతా రాముల వారిని పల్లకి ఊరేగింపుతో కార్యక్రమం ముగింపు చేశారు. క్విజ్‌లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో TELANGANA NRI FORUM సభ్యులు JET UK ట్రస్టీ మరియు JET UK సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేసారు.