Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సానుకూల దృక్పథంతోనే ఒత్తిడి మాయం : గరికపాటి

మనం ఆలోచించే తీరులోనే మార్పు వస్తేనే ఒత్తిళ్లను జయించవచ్చని ప్రముఖ పండితులు గరికపాటి నరసింహారావు సూచించారు. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ఒత్తిడి మాయమవుతుందని చెప్పారు. అమెరికాలోని న్యూజెర్సీ ఎడిషన్‌లోని సాయిదత్త పీఠంలో తెలుగు కళాసమితి వారితో పాటు స

సానుకూల దృక్పథంతోనే ఒత్తిడి మాయం : గరికపాటి
, బుధవారం, 17 ఆగస్టు 2016 (17:18 IST)
మనం ఆలోచించే తీరులోనే మార్పు వస్తేనే ఒత్తిళ్లను జయించవచ్చని  ప్రముఖ పండితులు గరికపాటి  నరసింహారావు సూచించారు. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ఒత్తిడి మాయమవుతుందని చెప్పారు. అమెరికాలోని న్యూజెర్సీ ఎడిషన్‌లోని సాయిదత్త పీఠంలో తెలుగు కళాసమితి వారితో పాటు  సంయుక్తంగా నిర్వహించిన గరికపాటి ప్రవచన కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గరికపాటి ఒత్తిడి ఎలా జయించాలనే దానిపై భక్తులకు దిశానిర్దేశం చేశారు. 
 
ప్రతి జీవుడిలో దేవుడు ఉన్నారనీ, అది గుర్తించకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని గరికపాటి తెలిపారు. దేవుడిని పూజించడం అంటే కేవలం పూజాకార్యక్రమాలే కాదనీ, దేవుడు చూపిన మార్గంలో నడవమన్నారు. మన పురాణగాధల్లో దేవుళ్లు అనుసరించిన మార్గాలను మనం గుర్తెరిగి.. అలా ప్రవర్తించగలిగితే మనలో కూడా ఒత్తిడి ఇట్టే ఎగిరిపోతుందన్నారు. 
webdunia
 
రామాయణంలో రాముడు అనుసరించిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి ఆందోళనలు లేకుండా జీవించవచ్చని గరికపాటి తెలిపారు. మహాభారతం కూడా మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పుతుందన్నారు. ప్రతి దానిపై మమకారం పెంచుకోవడం.. భవిష్యత్తుపై విపరీతమైన ఆలోచనలే ఒత్తిడికి కారణమవుతున్నాయన్నారు. మన త్యాగాలతోనే ఒత్తిడికి దూరం కాగలమని తెలిపారు. 
webdunia
 
మహాభారతంలో ఇలాంటి త్యాగాలకు సంబంధించిన ఘట్టాలను  గరికపాటి వివరించారు. పురాణ గాధల్లో ఒత్తిడిని జయించిన వారి గురించి ఉదాహరణలతో సహా గరికపాటి చెప్పుకొచ్చారు. పురాణ పద్యాలను ఉదహరిస్తూ.. సమకాలీన సత్యాలను వివరిస్తూ గరికపాటి ప్రసంగం సందేశం ఇవ్వడంతో  పాటు ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాఖీ స్పెషల్ : రైస్ ఖీర్ ఎలా చేయాలో తెలుసా?