Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మన గ్రామం, మన బాధ్యత... ఎన్నారై తెదేపా

మన గ్రామం, మన బాధ్యత... ఎన్నారై తెదేపా
, శుక్రవారం, 10 జులై 2015 (21:46 IST)
మన గ్రామం, మన బాధ్యతగా ప్రవాసాంధ్రులు జన్మభూమికి తోడ్పడాలని రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. అమెరికాలో ఎన్నారై తెదేపా నాయకులు శ్రీనివాసరావు కొమ్మినేని అధ్యక్షతన ఎన్నారైలతో సమావేశం ఏర్పాటు చేయడమైనది. ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మన్నవ మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధితో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందన్నారు. ఏ దేశంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక రాజకీయ పురోభివృద్ధికి స్పందించే గుణం తెలుగువారికి ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పథకాలు అమలులో ప్రతి ఒక్కరి భాగస్వాములను చేసేందుకు స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.
 
కొమ్మినేని మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ పథకం దోహదపడుతుందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చి రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా జన్మభూమి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో రూపొందించిన స్మార్ట్ విలేజ్ - స్మార్ట్ వార్డ్ పోస్టరును రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారావు ఆవిష్కరించారు. 
 
అనంతరం మన్నవను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెదేపా నాయకులు బ్రహ్మేశ్వరరావు మైనేని, నాగేంద్ర వడ్లముడి, శ్రీనివాసరావు కొమ్మినేని, అశోక్ దాచర్ల, భాస్కర్ మన్నవ, పుల్లారావు మండదపు, రాంబాబు, వెంకటే, శ్రీధర్ నెల్లూరు, కిరణ్ కాంత్, గోపి, బాలాజీ, సాగర్, రవి, ప్రసన్న, మనోజ్, విద్యాసాగర్, కోటి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu