Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఎన్నారై టిడిపి

Advertiesment
nri tdp slams on audio tapes issue
, సోమవారం, 8 జూన్ 2015 (18:45 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సహచర మంత్రులు, ప్రభుత్వాధికారుల ఫోన్లు ట్యాప్ చేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు. జూన్ 6, ఆదివారంనాడు అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నారై తెదేపా నాయకులు మాట్లాడుతూ... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ సంభాషణలను తెలంగాణ ప్రభుత్వం ఏ అధికారంతో రికార్డు చేసి మీడియాకు విడుదల చేసిందని ఎన్నారైలు ప్రశ్నించారు. 
 
కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కేసీఆర్, నాయనిపై క్రమినల్ కేసులు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సంతలో పశువులను కొన్నట్లు తెదేపా ఎమ్మెల్యేలను కొని క్యాబినెట్లో చేర్చుకుని తిరిగి చంద్రబాబుపై బురద చల్లడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకి ఉన్న బలానికన్నా ఎక్కువమందిని పోటీకి దించి అవినీతిని ప్రోత్సహించి ఈ వివాదానికి కారణమైన తెరాస పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమీషన్ ను కోరారు.
 
ఈ కార్యక్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు, అశోక్ దాచర్ల, బాలజి, పుల్లారావు, నవీన్, గోపి, వెంకట్, రాంబాబు, రవి, విద్యాసాగర్, శ్రీనివాసరావు చెరుకూరి, శ్రీధర్ నెల్లూరు, నరేష్ మానుకొండ, సాగర్ మన్నవ, వాసు నందిపాటి, పవన్ చుండు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu