Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బే ఏరియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆత్మీయ సమావేశం

భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో దూసుకుపోతూ తెలుగు ప్రజలందరికి చేరువైన నాట్స్ కాలిఫోర్నియాలో గల బే ఏరియాలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ ప్రతినిధి శ్రీనివాస్ కొమ్మినేని మాట్లాడుతూ సేవా రంగంలో ముందుండే నాట్స్ తెలుగు ప్రజలందరికి చేరువై

బే ఏరియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆత్మీయ సమావేశం
, సోమవారం, 22 మే 2017 (12:54 IST)
భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో దూసుకుపోతూ తెలుగు ప్రజలందరికి చేరువైన నాట్స్ కాలిఫోర్నియాలో గల బే ఏరియాలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ ప్రతినిధి శ్రీనివాస్ కొమ్మినేని మాట్లాడుతూ సేవా రంగంలో ముందుండే నాట్స్ తెలుగు ప్రజలందరికి చేరువై అందరి మన్ననలు పొందుతుందన్నారు.
 
"నాట్స్ హెల్ప్ లైన్" ద్వారా సేవలందిస్తూ ఆపదలో వున్న ప్రతి ఒక్కరికి ఆపన్న హస్తం అందిస్తుందన్నారు. నాట్స్ అమెరికాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా ఆపదలు, ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా పేదల కొరకు మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు పుస్తకాల పంపిణి మరియు తరగతి గదుల అభివృద్ధికి నిధుల సహాయం చేస్తుందన్నారు. నాట్స్ ఒక్క సేవా కార్యక్రమాలే కాకుండా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాల వారికీ అందించేందుకు ప్రతి రెండు సంవత్సరాలకి ఒక్కసారి తెలుగు సంబరాలు నిర్వహిస్తుంది.
 
నాట్స్ 5వ వార్షిక సంబరాలు ఈసారి చికాగోలో జూన్ 30 నుండి జులై 2 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయని, అందరూ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.sambaralu.ఆర్గ్ వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని చికాగో సంబరాలలో భాగస్వాములై నాట్స్ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కొమ్మినేని, అశోక్ దాచర్ల, పుల్లారావు మందడపు, వాసు నందిపాటి, తారక్ నందిపాటి, రాంబాబు మందడపు, వెంకట్ కోడలి  శ్రీనివాస్, అనిల్ చలసాని, సతీష్, శ్రీకాంత్ బొక్క, అభిరాం, అనిల్ బండి, శ్రీధర్, శ్రీనివాస్ చెరుకూరి, సోని  దాసరి, రాజేష్, సాగర్ మల్లవరపు, శివ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట చికెన్ ముక్కలు తీసుకోవచ్చా?