Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాస్ఏంజల్స్‌లో నాట్స్ తెలుగు సంబరాలు, అవార్డులు

Advertiesment
NATS
, సోమవారం, 29 జూన్ 2015 (16:00 IST)
లాస్ఏంజల్స్‌లో జూలై 2-4 వరకు జరిగే నాట్స్ తెలుగు సంబరాలు అవార్డ్స్ కార్యక్రమంలో జి.ఎమ్.ఆర్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు, సంగీత దర్శకులు కోటి మరియు నటుడు తనికెళ్ళ భరణిలను నాట్స్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్లు, శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్, శ్రీ రఘురామ కృష్ణంరాజు మరియు శ్రీ PP రెడ్డిలను ప్రముఖ పారిశ్రామికరంగ ప్రతిభా పురస్కారంతో సత్కరించనున్నట్లు, నటుడు సాయికుమార్, రమేష్ వడలి (greetway), శ్వేతా రావు, యార్లగడ్డ కృష్ణ నాగేశ్వరరావు, స్వర్గీయ PJ శర్మలను విశిష్ఠకళా పురస్కారంతోను, డా. ప్రేమసాగర్ రెడ్డి, రాజు రెడ్డి, గంగాధర్ దేసు, గుత్తికొండ శ్రీనివాస్, డా. లక్కిరెడ్డి హనిమి రెడ్డి, రవి మదాల, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(RDT), సుమతి, వంశీ రామరాజు, YK నాగేశ్వర రావు, డా. రవి ఆలపాటి, అంబికా కృష్ణలను విశిష్ఠ సేవా పురస్కారంతో సత్కరించనున్నట్లు, ఆచార్య ఎనాక్‌ను తెలుగుకీర్తి దురంధర పురస్కారంతోను, సాయికృష్ణ దేవులురి విశిష్ఠ క్రీడా పురస్కారంతోను, ఉమరాజేశ్వరి, కళామందిర్ కళ్యాణ్, వేమీ డి వాట్సన్‌లను విశిష్ఠ ప్రతిభా పురస్కారం తోను, కిరణ్ ప్రభను మహాకవి గురజాడ  పురస్కారంతోను సత్కరించనున్నట్లు తెలిపారు.  
webdunia
 
ఈ అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ది శాఖామంత్రివర్యులు శ్రీ వెంకయ్యనాయుడు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డా కోడెల శివ ప్రసాద్ చేతుల మీదుగా అందజేస్తారని నాట్స్ అధ్యక్షులు రవి ఆచంట, నాట్స్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ డా. మధు కొర్రపాటి, నాట్స్ సంబరాల సంచాలకులు డా. ఆలపాటి రవి, అవార్డు కమిటీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి ఎలమురి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu