Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాట్స్ సంబరాలు.. జూలై 2,3,4 తేదీల్లో అలరించనున్న కల్చరల్ ప్రోగ్రామ్స్

Advertiesment
NATS Cultural Events
, సోమవారం, 29 జూన్ 2015 (14:28 IST)
అమెరికా‌లోని లాస్ ఏంజెలెస్ ప్రాతంలో గల ఎనహెం కన్వెన్షన్ సెంటర్లో జూలై 2, 3, 4 తారీఖులలో జరిగే “నాట్స్ సంబరాలు 2015”లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అద్భుతంగా రూపొందించారని కల్చరల్ డైరెక్టర్ డాంజి తోటపల్లి చెప్పారు. 
 
500 మంది పైచిలుకు అమెరికా తెలుగు ప్రతిభావంతులు గత రెండు నెలలుగా కస్టపడి నాట్స్ నవరసాలు, స్వర సంగమం, ఈ రోజు నీరాజనాలు, మాయాబజార్, నాట్స్ అష్టావధానం, తారలు దిగివచ్చిన వేళ, వేమన సుమతి భావం, అన్నమయ్య గానామృతం, కామెడీ స్పెషల్, తరతరాల అమరావతి, ఆముక్తమాల్యద కూచిపూడి నృత్యం తదితర అద్భుతమయిన కార్యక్రమాలు రూపొందించారని చెప్పారు. అంతేకాకుండా ఇండియా నుండి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మానియా, జానపద గానాలు నృత్యాలతో అందరిని అలరించటానికి "నాట్స్ సంబరాలు 2015" సర్వం సిద్ధమయిందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu