Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూజెర్సీలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్

Advertiesment
NATs

ఐవీఆర్

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (20:26 IST)
అమెరికాలో తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూ జెర్సీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. న్యూజెర్సీలో దాదాపు 200 మంది తెలుగు క్రికెట్ ప్లేయర్లు ఈ టోర్నమెంట్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఈ టోర్నమెంట్‌లో ఎడిసన్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. రామ్ కోట ఎడిసన్ కింగ్ కెప్టెన్‌గా టీంను గెలిపించడంలో కీలకపాత్ర వహించారు. ఎఫ్ 5 జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ టీంకు కెప్టెన్‌గా తులసి తోట వ్యవహరించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గత వారం రోజులుగా లాజిస్టిక్స్ & ప్లానింగ్ లలో విశేష కృషి చేశారు. నాట్స్ న్యూజెర్సీ విభాగం క్రీడా సమన్వయకర్త రమేశ్ నెల్లూరి చేసిన కృషి మరువలేనిదని నాట్స్ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. 
 
తెలుగువారిని కలిపే ఆటలైనా, పాటలైనా ఎప్పుడూ నాట్స్ ముందుంటుందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రికెటర్లను ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ నాయకులు సురేంద్ర పోలేపల్లి, ప్రశాంత్ కుచ్చు, వెంకటేష్ కోడూరి, కిరణ్ మందాడి, ప్రసాద్ టేకి, క్రాంతి యడ్లపూడి, హరీష్ కొమ్మాలపాటి, రాకేష్ వేలూరి, ధర్మేంద్ర ముమ్మిడి తదితరులు ఈ టోర్నమెంట్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి నాట్స్ జాతీయ నాయకులు గంగాధర దేసు, బిందు యలమంచిలి, టిపి రావు, శ్రీహరి మందాడి, శ్రీనివాస్ భీమినేని, శ్రీనివాస్ మెంట, మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ కొల్లా, రవి తుబాటి, శంకర్ జెర్రిపోతుల, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, రాజేష్ బేతపూడి, శ్రీధర్ దోనేపూడి, హరీష్ కొమ్మాలపాటి, బినీత్ పెరుమాళ్ల తదితరులు విచ్చేసి క్రికెటర్ల క్రీడా స్ఫూర్తిని అభినందించారు. విజేతలకు, అత్యుత్తమ ఆటగాళ్లకు బహుమతులు అందచేశారు.
 
నాట్స్ బోర్డు డైరెక్టర్స్ టీపీ రావు, బిందు యలమంచిలి, మాజీ అధ్యక్షుడు గంగాదర్ దేసు, వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) శ్రీనివాస్ భీమినేనిలు నాట్స్ ఆవిర్భావం నుండి నాట్స్ చేస్తున్న భాష, సేవా కార్యక్రమాలు, ఇటు అమెరికాలో, అటు ఇండియాలోని రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రకృతి వైపరీత్యాలలో చేసిన, చేస్తున్న సేవల గురించి, మెంబెర్షిప్ డ్రైవ్ గురించి అందరికీ తెలియచేశారు. న్యూజెర్సీ నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు తేనెలో ఇవి కలిపి తీసుకుంటే...