Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాట్స్ లాస్ ఏంజిల్స్ ఆధ్వర్యంలో 'మీ ఆరోగ్యం-తీసుకోవలసిన జాగ్రత్తలు'

25.09.2016 ఆదివారం కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజిల్స్ నగరంలో గల సెరిటోస్ సనాతనధర్మ టెంపుల్ సమావేశ మందిరంలో మీ ఆరోగ్యం తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిష్ణాతులైన ప్రముఖ వైద్యులు పాల్గొని క్యాన్సర్ నివార

Advertiesment
నాట్స్ లాస్ ఏంజిల్స్ ఆధ్వర్యంలో  'మీ ఆరోగ్యం-తీసుకోవలసిన జాగ్రత్తలు'
, మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (20:05 IST)
25.09.2016 ఆదివారం కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజిల్స్ నగరంలో గల సెరిటోస్ సనాతనధర్మ టెంపుల్ సమావేశ మందిరంలో మీ ఆరోగ్యం తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిష్ణాతులైన ప్రముఖ వైద్యులు పాల్గొని క్యాన్సర్ నివారణ, డయాబెటిస్ చికిత్స, గుండె సంబంధిత వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక ఒత్తిడి, స్థూలకాయం మరియు మహిళల ఆరోగ్యం అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 650 మందికి పైగా పాల్గొన్నారు. ప్రముఖ ఆసుపత్రి స్టాఫ్ ఎండీ డాక్టర్ శారద మైల మాట్లాడుతూ... ఆధునిక మహిళలు ఎదుర్కొంటున్న వివిధ ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించి, మహిళలు అడిగిన వివిధ ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు ఇచ్చారు. 
 
ప్రఖ్యాత అంకాలజిస్ట్ డాక్టర్ వీణాచారు, క్యాన్సర్ వల్ల కలిగే పరిణామాలు, ముందుగానే ఎలా గుర్తించవచ్చు మరియు నివారణ చర్యలు గురించి వివరించారు. డాక్టర్ సయ్యద్ అలీ, ఎండీ ఎండోక్రినాలజిస్ట్ మాట్లాడుతూ... భారత సంతతి పౌరులకు మధుమేహం వచ్చే అవకాశం, దాని లక్షణాలను వివరించారు. ఎవరికైనా మధుమేహం నిర్థారణ అయితే ఆ సందర్భంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన మందులను మరియు సమస్యలు గురించి వివరించారు. డాక్టర్ రంగారావు పంగులూరి స్థూలకాయం వల్ల కలిగే ఇబ్బందులు, జాగ్రత్తలు మరియు నివారణ చికిత్సలు గురించి వివరించారు. 
 
సునీత చురీవాలా యుక్తవయసు పిల్లల మానసిక స్థితి వారితో తల్లిదండ్రులు ఎలా మెలగాలి అనే దానిపై చర్చించారు. డాక్టర్ సుబ్బారావు మైల మాట్లాడుతూ... గుండె జబ్బుల గురించి మరియు నివారణకు ఇప్పుడు లభిస్తున్న ఆధునిక పరిజ్ఞానం తదితర అంశాల గురించి వివరించారు. డాక్టర్ మురళి 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఏర్పాటు చేసి మానవ శరీరం యొక్క సాధారణ పనితీరుపై క్విజ్ నిర్వహించి బహుమతులు, నాట్స్ నుండి మెరిట్ సర్టిఫికెట్లు బహూకరించారు.
 
నాట్స్ లాస్ ఏంజిల్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన నాట్స్ సభ్యులకి, వాలంటీర్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో నిర్వహిస్తామని, అందరూ పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిండు క్రింద వెల్లుల్లి పెట్టుకొని నిద్రిస్తే...?