Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయిదత్త పీఠంలో వైభవంగా దసరా వేడుకలు... అమెరికాలో బతుకమ్మ ఆడిన తెలుగు మహిళలు

అమెరికాలో భారతీయ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠం దసరా వేడుకలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీ సౌత్ ప్లయిన్ఫీల్డ్ లోని సాయిదత్త పీఠంలో నవరాత్రుల వేడుకలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. తొమ్మది రోజులు తొమ్మిది అలంకారాలత

సాయిదత్త పీఠంలో వైభవంగా దసరా వేడుకలు... అమెరికాలో బతుకమ్మ ఆడిన తెలుగు మహిళలు
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (19:20 IST)
అమెరికాలో భారతీయ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠం దసరా వేడుకలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీ సౌత్ ప్లయిన్ఫీల్డ్ లోని సాయిదత్త పీఠంలో నవరాత్రుల వేడుకలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. తొమ్మది రోజులు తొమ్మిది అలంకారాలతో పాటు, అమ్మ వారికి లక్ష కుంకుమార్చన, చండీ హోమం, బాబా పుణ్య తిథి, లక్ష పుష్పార్చనతో పాటు మొత్తం 11 రోజుల పాటు... ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో ఆ దేవి దర్శన భాగ్యాన్ని సాయిదత్త పీఠం కల్పించింది. 
 
ప్రతి రోజు దేవి కలశ పూజ, దేవీ సహస్ర నామ పూజ, చండీ సప్తశతీ పారాయణ, అమ్మవారికి, బాబాకు అఖండ హారతి, శ్రీ చక్రానికి శ్రీసూక్తంతో అభిషేకం, విష్ణు సహస్ర నామ పరాయణ, సామూహిక కుంకుమార్చన, లలితా సహస్ర నామ పారాయణ, ధూప హారతి, షేజ హారతి, ఘార్భా, దేవీ మాతకు హారతి లాంటి కార్యక్రమాలతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. నవరాత్రుల సందర్భంగా ఏర్పాట్లు, భక్తిరస, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. 
 
భక్తి గీతాలతో సాయిదత్త పీఠం మారుమ్రోగిపోయింది. అఖిల జగాలకు అమ్మవు నీవు అంటూ ఆ అఖిలాండేశ్వరీ భక్తులు తొమ్మిదిరోజులు ఎంతో భక్తితో కొలిచారు. బతుకమ్మ ఉత్సవాలను కూడా సాయిదత్త పీఠం ఘనంగా నిర్వహించింది. పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మన తెలుగు మహిళల అంతా బతుకమ్మ పాటలు పాడారు. అమెరికాలో అచ్చ తెలుగు ఆధ్యాత్మిక పాటలను పాడారు. స్థానిక సాంస్కృతిక సంస్థలు, కళా శిక్షణ సంస్థలు సాయి దత్త పీఠంలో ఏర్పాటు చేసిన నృత్య రూపకాలు, గాన విభావరిలకు చక్కటి స్పందన లభించింది. 
webdunia
 
దసరా విశిష్టతను తెలిపేలా వేసిన నృత్య రూపకాలు అద్భుతం.. అపూర్వం అనేలా సాగాయి. హిందువుల పండుగలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న సాయిదత్త పీఠం.. దసరా వేడుకలను కూడా అద్భుతంగా నిర్వహించింది. చివరగా, అమ్మవారికీ, బాబాకీ పల్లకీ సేవలో వందలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. 
 
విజయదశమి, బాబా పుణ్య తిథి నాడు అహర్నిశలూ బాబా సచ్చరిత్ర పారాయణలో భక్తులు పాల్గొన్నారు. ఆఖరి రోజున భక్తులకు సాయి బాబా వేష ధారణలో ప్రముఖ సినీ నటుడు విజయచందర్ విచ్చేసి అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు. ఆయన చేతుల మీదుగా భక్తులకు జరిగిన అన్నప్రసాదం కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. అందరూ బాబా రూప ధారణలో ఉన్న విజయచందర్‌తో ఫోటోలు దిగి పరవశానికి లోనయ్యారు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు వాడే సబ్బు నాణ్యమైనదేనా...?! ప్యాకింగ్ చూసి తెలుసుకోండి ఇలా...