Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘనంగా ముగిసిన ఆటా సభలు... ప్రముఖులకు వంశీ అవార్డ్‌ల ప్రదానం

అమెరికాలోని చికాగో నగరంలో మూడురోజుల పాటు నిర్వహించిన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) రజతోత్సవ వేడుకలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు ర

Advertiesment
ata 2016 conference success
, మంగళవారం, 5 జులై 2016 (13:37 IST)
అమెరికాలోని చికాగో నగరంలో మూడురోజుల పాటు నిర్వహించిన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) రజతోత్సవ వేడుకలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు రాజకీయ అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. 
 
అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడుల అవకాశాలపై సెమినార్‌ నిర్వహించారు. దీంతోపాటు ప్రముఖ అవధాన పండితుడు నరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో కవిసమ్మేళనం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఉత్సవాలకు హాజరైన ప్రముఖులను, కళాకారులను ఘనంగా సత్కరించిన ఆటా ప్రతినిధులు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆటాకు అధ్యక్షులుగా పని చేసినవారిని అవార్డులు ప్రదానం చేశారు. చివరిగా సినీ కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
 
ఆటా రజతోత్సవ వేడుకలు ముగింపు సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ఇరవైమంది ప్రముఖులకు ఆటా సభల్లో ‘వంశీ’ అవార్డులు ప్రదానం చేశారు. ప్రముఖులు జయంతి సుబ్బారావు, వినోద్‌ కోడూరు, కట్టమంచి ఉమాపతి రెడ్డి, సుందర్‌ దిట్టకవి, ఇసై ఖార్‌ షరీఫ్‌, రామనాథ్ కందాల, ప్రసన్న రెడ్డి, స్వాతి గుండపునీడి, చింతం సుబ్బారెడ్డి, హనుమంత రెడ్డి, సునీత, రామరాజు యలవర్తి, రమణ మూర్తి యడవర్తి, దామరాజు లకి్క్ష, కమల చిమట, రత్నం చిట్టూరి, ప్రేమ సాగర్‌ రెడ్డి, తాతా ప్రకాశం హేమలత బుర్ర రాజు చామర్తి , సందీప్‌ భరద్వాజలకు వంశీ రామరాజు ఈ అవార్డులను ప్రదానం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏసీకి అలవాటయ్యారో మీ పని గోవిందా! రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో అనారోగ్యాలే!