Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిందువులుగా మారుతోన్న అమెరికన్లు : న్యూస్‌వీక్

Advertiesment
ఎన్ఆర్ఐ
అమెరికా ప్రజలందరూ హిందువులుగా మారిపోతున్నారనీ.. అమెరికన్ల మత విశ్వాసాలు, భావనలు రోజు రోజుకూ హిందూమతానికి దగ్గరవుతున్నాయని "న్యూస్‌వీక్" పత్రిక వెల్లడించింది. ఈ పత్రిక మత విషయాల సంపాదకుడు లీసా మిల్లర్ "ఇప్పుడు మనమంతా హిందువులమే" అనే పేరుతో ఓ వ్యాసాన్ని రాశారు.

ఇటీవలి కాలంలో జరిగిన పలు అభిప్రాయ సేకరణల సమాచారాన్ని విశ్లేషించి మిల్లర్ పై నిర్ధారణకు వచ్చారు. కనీసం భావనాత్మకంగానైనా అమెరికన్లు మెల్లమెల్లగా సంప్రదాయక క్రిస్టియన్లుగా కాకుండా పోతున్నారనీ, నానాటికీ ఎక్కువమంది హిందువులుగా మారిపోతున్నారని మిల్లర్ తన వ్యాసంలో పేర్కొన్నారు.

దేవుడి గురించి, ముక్తి గురించి అమెరికన్లు హిందువులుగా ఆలోచిస్తున్నారనీ, ఆలోచన విధానం సైతం హిందువుల్లాగానే ఉంటోందని, రోజు రోజుకీ హిందువులకు చాలా దగ్గరవుతున్నారని మిల్లర్ తన వ్యాసంలో వివరించారు. ఇందుకోసం ఆయన కాదని కొట్టిపడేయలేని ఆధారాలను సైతం చూపించారు.

2008లో నిర్వహించిన హారిస్ పోల్‌లో 24 శాతంమంది అమెరికన్లు హిందువుల్లాగా తమకు పునర్జన్మ అంశంపై నమ్మకముందని వెల్లడించారనీ, మూడో వంతు అమెరికన్లు ఇప్పుడు క్రైస్తవ మత ఆచారానికి విరుద్ధంగా హిందువుల్లాగా మృతదేహాలను దహనం చేస్తున్నారని మిల్లర్ తెలిపారు. కాగా.. అమెరికన్లలో ఎక్కువమంది ఇప్పుడు క్రైస్తవ మతానికి వెలుపల ఆధ్యాత్మిక అన్వేషణను సాగిస్తున్నారన్నది నిజం.

Share this Story:

Follow Webdunia telugu