Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విదేశీ విద్యార్థులకు వీసాలతో పాటు "గైడ్"లు...!

Advertiesment
ఎన్ఆర్ఐ
భారత విద్యార్థులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో తమ దేశం సురక్షితమైందన్న సందేశాన్నిచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగా ఇకనుంచి తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు వీసాలతో పాటు సమగ్ర సమాచారం ఉండే చిన్న పుస్తకాన్ని కూడా అందించాలని భావిస్తోంది.

"గైడ్ టూ స్టడీయింగ్ అండ్ లివింగ్ ఇన్ ఆస్ట్రేలియా" అనే పేరుతో ముద్రించనున్న ఈ పుస్తకంలో ఆసీస్ సమాజంపై అవగాహన కల్పించే సమాచారాన్ని పొందుపరచనున్నారు. ఇంకా ఈ గైడ్‌లో ఆసీస్ సమాజం, సంస్కృతి, వారితో కలిసిపోయేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఉంటాయి.

విదేశీ విద్యార్థులకు సురక్షిత ప్రాంతంగా తమకున్న పేరుకు భంగం వాటిల్లడాన్ని తీవ్రంగా పరిగణించిన తాము.. ఈ రకమైన చర్యలను చేపట్టామని ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వ్యాపార శాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా... భారత విద్యార్థులపై దాడికి పాల్పడిన దుండగులను తమ ప్రభుత్వం చట్టం ముందు తప్పకుండా నిలబెడుతుందని చెప్పారు.

విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునేందుకు... రెండు రోజులపాటు అంతర్జాతీయ విద్యార్థులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని సెప్టెంబర్ 14వ తేదీ నుంచి కాన్‌బెర్రాలో నిర్వహించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించినట్లు పై ప్రతినిధి పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu