Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాస్ ఏంజిల్స్‌లో ప్రవాసాంధ్రుల క్రికెట్

Advertiesment
ఎన్ఆర్ఐ
లాస్ ఏంజిల్స్‌ నగరంలో ప్రతి సంవత్సరం వేసవికాలంలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ఈసారి మరింత ఉత్సాహభరితంగా జరిగింది. కాగా, ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్‌లో టైగర్స్ జట్టు చీటాస్ జట్టుపై 24 పరుగుల తేడాతో గెలుపొందింది.

అనంతరం... స్థానిక మలిబు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో టోర్నీ విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహకులు సురేష్ ఆకునూరు మాట్లాడుతూ... వాలి క్రికెట్ సంఘం తరపున ప్రతియేటా ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుమునుపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగరాజు శెట్టి దంపతులు జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాలను ప్రారంభించారు.

కాగా.. టోర్నీ నిర్వహణకు కృషి చేసిన మధు బొడపాటి, కుమార్ తలంకి, వెంకట్ ఇరమల్ల, శ్రీనివాస కిలాడ, వాసు వావిల్ల, షాషి అంబటి, శ్రీమతి పావని, శ్రీరామ్ ఆకునూరు తదితరులకు సురేష్ ఆకునూరు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu