Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముష్కరుల దాడిలో ఎడమకన్ను కోల్పోయిన నీరజ్..!!

Advertiesment
ప్రత్యేక వార్తలు
FILE
ఆస్ట్రేలియాలో భారతీయుల రక్షణ కోసం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామంటూ అక్కడి ప్రభుత్వం ఎంతగా చెబుతున్నా.. జాత్యహంకార దాడులు మాత్రమ ఆగటం లేదు. తాజాగా సోమవారంనాడు నీరజ్ భరద్వాజ్ అనే భారత విద్యార్థిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో నీరజ్ ఎడమకన్ను, ముక్కు, పక్కటెముకలకు తీవ్ర గాయాలు కాగా.. 90 శాతం మేర ధ్వంసమైన కన్ను మాత్రం పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్లు "ది ఏజ్" పత్రిక గురువారం వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. లోకల్ ట్రైన్ కోసం వేచి చూస్తున్న 23 సంవత్సరాల నీరజ్‌పై ఇద్దరు తాగుబోతు ఆస్ట్రేలియన్లు దాడికి పాల్పడ్డారు. వాళ్లు అడిగినట్లుగా నీరజ్ మనీ పర్సును ఇచ్చినప్పటికీ ఊరుకోని అగంతకుల్లో ఒకడు ధీరజ్‌ను ఇష్టం వచ్చినట్లుగా ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో నీరజ్ స్పృహతప్పి పడిపోయాడు.

దాడి అనంతరం తేరుకున్న నీరజ్ మాట్లాడుతూ.. మీ దేశానికి మీరు వెళ్లిపోండి అంటూ దుండగులు తనను దూషిస్తూ, చావబాదారని వాపోయాడు. తాను స్పృహతప్పి పడిపోవటంతో అప్పటికి వదిలేసి వెళ్లిన ఆస్ట్రేలియన్లు మళ్లీ పావుగంట తరువాత వచ్చి దాడికి తెగబడ్డారని పేర్కొన్నాడు. కాగా.. నీరజ్‌ను పరీక్షించిన డాక్టర్లు అతని ఎడమకన్ను 80 నుంచి 90 శాతం మేర ధ్వంసమైందనీ, దాన్ని మళ్లీ బాగుచేయటం సాధ్యంకాని పని అని తేల్చి చెప్పినట్లు ది ఏజ్ వివరించింది.

ఇప్పటిదాకా జరిగింది చాలనీ, ఇకపై ఒక్కక్షణం కూడా ఈ దేశంలో ఉండననీ నీరజ్ అంటున్నాడు. ఇక్కడ పనిచేయనూ వద్దు, చదువుకోనూ వద్దు.. బ్రతికుంటే బలిశాకు తిని బ్రతకవచ్చునని, అనుక్షణం భయంతో ఇక్కడ బ్రతుకు గడపటం కష్టసాధ్యమని తెగేసి చెబుతున్నాడు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న తన జీవితాన్ని దుండగులు నరకప్రాయం చేశారని, ఆస్ట్రేలియా భారతీయులకు ఏ మాత్రం సురక్షితం కాదని నీరజ్ వ్యాఖ్యానించినట్లు ది ఏజ్ కథనం తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu