Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాంద్యంతో కళ తగ్గిన "ఇండియన్ బ్రైడల్ ఫెయిర్"

Advertiesment
ఎన్ఆర్ఐ
ప్రపంచమంతటా విలయతాండవం చేస్తున్న ఆర్థికమాంద్యం దెబ్బకు ఆస్ట్రేలియాలో ప్రతియేటా నిర్వహించే భారతీయ వివాహ వేదిక (ఇండియన్ బ్రైడల్ ఫెయిర్) సైతం కుదేలయ్యింది. సంక్షోభం కారణంగా భారత ప్రభుత్వం, కార్పొరేట్ రంగం ఈ కార్యక్రమానికి మద్ధతివ్వలేమంటూ చేతులెత్తేయడంతో ప్రధాన భాగస్వాములు వెనక్కి తగ్గారు. దీంతో వివాహ వేదిక వెలవెల బోయింది.

రెండు రోజులపాటు జరిగే ఈ ఇండియన్ బ్రైడల్ ఫెయిర్ కార్యక్రమం శనివారం మెల్‌బోర్న్‌లో ప్రారంభమయ్యింది. వివాహానికి సంబంధించిన వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రతి సంవత్సరం ఒక్కో నగరంలో ఈ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నారు. అయితే మెల్‌బోర్న్‌లో తొలిసారిగా ఏర్పాటయిన ఈ వివాహ వేదిక పెద్దసంఖ్యలో ప్రజలు, ప్రదర్శనకారుల్ని ఆకట్టుకోలేక పోయింది.

ఈ సందర్భంగా వేదిక నిర్వాహకుడు, ఇండియా ట్రేడ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ నానా లక్ష్మణ్ మాట్లాడుతూ... భారత ప్రభుత్వం, కార్పొరేట్ రంగం ఈ ఏడాది తమకు అండగా లేవనీ, ఎప్పుడూ తమకి మద్ధతుగా నిలిచే ఎయిర్ ఇండియా సైతం సంక్షోభం కారణంగా తప్పుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్ళుగా నిర్వహిస్తున్న ఈ వేదికకు గతంలో ప్రజల్లో, ప్రదర్శనకారుల్లో పెద్ద ఎత్తున స్పందన ఉండేదనీ, ఈ సంవత్సరం ఎలాంటి స్పందనా లేదని లక్ష్మణ్ వాపోయారు.

కాగా... భారత్ వెళ్లే అవసరం లేకుండానే వివాహాలకు కావలసిన అన్నిరకాల ఉత్పత్తులను తాము ఈ వేదికలో అందుబాటులో ఉంచుతున్నామని లక్ష్మణ్ తెలియజేశారు. వచ్చే ఏడాదిలో నిర్వహించే వేదికలో జ్యోతిష్యం, హస్తాముద్రికం, సంఖ్యా శాస్త్రానికి సంబంధించిన సేవలను కూడా అందించనున్నామని లక్ష్మణ్ వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu