Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రిటన్ జాతివివక్ష దాడులు : టీనేజర్లకు జైలు..!

Advertiesment
ప్రత్యేక వార్తలు
FILE
జాత్యహంకారంతో భారతీయులపై విరుచుకుపడి దాడి చేసిన ముగ్గురు బ్రిటన్ టీనేజర్లు త్వరలోనే జైలు ఊచలు లెక్కించనున్నారు. కవల సోదరులైన జస్టిన్, లూక్‌లవ్‌డేల్‌లు.. మరో టీనేజర్ నికోలస్ గార్డెనర్ అనే ముగ్గురు యువకులు భారత సంతతికి చెందిన ఓ షాపు కీపర్‌ అశోక్ సెల్వంపై దాడికి పాల్పడ్డారు. అనంతరం మరో షాపులోకి చొరబడి భయోత్పాతం సృష్టించారు.

గత జూన్ 6వ తేదీన ఈ ముగ్గురు యువకులు బ్రిస్టన్‌లోని షాపుల్లో చేసిన ఆగడాలు సీసీ కెమెరాలకు చిక్కడంతో వీరి ఆగడాలు గుట్టు రట్టయ్యాయి. సీసీ కెమెరాల్లోని చిక్కిన వీడియోలను బాధితుల తరపు న్యాయవాది బ్రిస్టల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి వీరిని దోషులుగా నిర్ధారిస్తూ శిక్షను నవంబర్ 11వ తేదీకీ వాయిదా వేశారు.

అయితే విచారణ సందర్భంగా పై ముగ్గురు టీనేజర్లు తమ తప్పులను అంగీకరిస్తూనే.. జాతి విక్షతో తాము ఈ పని చేయలేదని న్యాయమూర్తికి విన్నవించుకోవటం గమనార్హం. కాగా.. కవల సోదర టీనేజర్లకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కాగా.. గార్డెనర్‌ను మాత్రం రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu