Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాడుల వెనుక కారణాలెన్నో..! : ఓవర్లాండ్

Advertiesment
ఎన్ఆర్ఐ
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడుల్లో, కొన్ని జాతివివక్షతో కూడుకున్నవేనని విక్టోరియా రాష్ట్ర ఛీప్ పోలీస్ కమీషనర్ సిమన్ ఓవర్లాండ్ అంగీకరించారు. అయితే విద్యార్థులపై జరిగిన దాడుల వెనుక సామాజిక, ఆర్థిక కారణాలెన్నో దాగి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ విషయమై ఓవర్లాండ్ మాట్లాడుతూ... జాత్యహంకారంతో జరిగిన దాడులు లేనేలేవని తాను చెప్పలేనని, కొన్ని దాడుల వెనుక ఖచ్చితంగా జాతి వివక్ష దాగి ఉందన్నారు. అయితే అవకాశవాద నేరాలే విద్యార్థుల ప్రస్తుత దుర్భలస్థితికి కారణాలుగా ఉంటున్నాయన్నది తాను గట్టిగా నమ్ముతున్నానని అన్నారు

నేర ప్రవృత్తి కలిగినవారి బారినపడిన భారత విద్యార్థులు బాధితులయ్యారనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హామీనిస్తున్నానని ఓవర్లాండ్ ప్రకటించారు. భారతీయులు దాడులకు ఎరగా మారారనీ, ఈ స్థితికి సామాజిక, ఆర్థిక కారణాలు చాలానే ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా భారతీయ విద్యార్థులు చౌక ఇళ్లలో నివసిస్తారనీ, పొద్దుపోయేదాకా పనిచేస్తారని, చాలామంది రాత్రి బాగా పొద్దుపోయేదాకా టాక్సీలను నడుపుతారని ఓవర్లాండ్ చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థులు తాగుబోతుల దృష్టిలోపడి సమస్యల్లో చిక్కుకుంటుంటారన్నారు. చాలామంది ఇళ్ళకు వెళ్లేందుకు ప్రజా రవాణాను ఆశ్రయించటం, ప్రయాణంలో ఐపాడ్‌లు, లాప్‌టాప్‌లను ఉపయోగించటంతో కూడా వీరు దాడులకు గురవుతున్నారని, అర్థరాత్రివేళల్లో ప్రజా రవాణా అంత శ్రేయస్కరం కాదని ఓవర్లాండ్ అన్నారు.

ఇదిలా ఉంటే... గడచిన కొన్ని వారాల్లోనే మెల్‌బోర్న్, సిడ్నీ నగరాలలో భారతీయ విద్యార్థులపై దాడి జరిగిన 20 ఘటనలు వెలుగుచూశాయి. దాడుల నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆ దేశ ప్రధానమంత్రితో సహా అందరు అధికారులు చెబుతున్నా రోజు రోజులు జాత్యహంకార దాడులు మాత్రం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే...!

కాగా... భారత విద్యార్థుల ఫెడరేషన్ (ఫిసా) అధ్యక్షుడు గౌతం గుప్తా ఓవర్లాండ్ అభిప్రాయాలతో ఏకీభవించారు. ప్రభుత్వం, విద్యా సంస్థలు విద్యార్థులకు సబ్సడీ ఇళ్ళు కల్పించటం, ఇతర సమస్యలను పరిష్కరించటం లాంటివి చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu