Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు తేజం కిషోర్‌కు అరుదైన గౌరవం

Advertiesment
ఎన్ఆర్ఐ
FILE
అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రుడు కిషోర్ కుంచం‌కు.. న్యూయార్క్ రాష్ట్రం లాంగ్ ఐలాండ్‌లోని ఫ్రీపోర్ట్ పాఠశాలల సూపరింటెండెంట్‌గా అరుదైన గౌరవం దక్కింది. కాగా.. ప్రతిష్టాత్మకమైన ఈ బాధ్యతను చేపట్టిన తొలి ఇండో-అమెరికన్‌గా కిషోర్ రికార్డు సృష్టించారని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. కిషోర్ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ, కార్పొరేట్ విద్యారంగంలో విశేషంగా సేవలు అందించారు. విద్యా విధానానికి సంబంధించి ఆయన అడ్మినిస్ట్రేటర్‌గా, అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లాంటి పలు హోదాలలో పనిచేస్తున్నారు.

న్యాయశాస్త్రంలో డాక్టరేట్ చేసిన కిషోర్.. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. అలాగే ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా ప్రొఫెషనల్ డిప్లొమా చేశారు. ఈయన మార్గదర్శకత్వం వల్ల న్యూయార్క్ రాష్ట్రంలో ఫ్రీపోర్ట్ రేటింగ్ అత్యల్ప స్థాయి నుంచి అత్యధిక స్థాయికి చేరింది.

కిషోర్ చేసిన అత్యున్నత సేవల కారణంగానే 2008లో ఫ్రీపోర్ట్ జిల్లా కంప్ట్రోలర్ కార్యాలయం నుంచి క్లీన్ ఆడిట్ గౌరవం సంపాదించుకుంది. కాగా.. 2009 జూలై ఒకటవ తేదీన ఈయన ఫ్రీపోర్ట్ పాఠశాలల సూపరింటెండెంట్‌గా బాధ్యతలను అధికారికంగా చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu