Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీసీఏ "బతుకమ్మ" వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం..!

టీసీఏ
FILE
అమెరికాలోని తెలంగాణా కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) ప్రతి ఏడాది అత్యంత వైభవంగా, భారీ ఎత్తున నిర్వహించే బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ విజయ్ చవ్వ, ప్రెసిడెంట్ బిక్షం ఒక ప్రకటనలో వెల్లడించారు. సెప్టెంబర్ 20వ తేదీన జరుగనున్న ఈ ఉత్సవాలు కాలిఫోర్నియాలోని సన్నివేల్ ప్రాంతంలోగల ఇన్ ఆర్టెగా పార్కులో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు వారు స్పష్టం చేశారు.

స్థానిక తెలుగు సంస్థలైన బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), సిలికానాంధ్ర సంస్థల సహాయ సహకారాలతో నిర్వహించనున్న ఈ బతుకమ్మ వేడుకలకు సన్నివేల్ మేయర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని విజయ్, బిక్షంలు వెల్లడించారు. 20వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటలవరకు ఈ వేడుకలు ఆట్టహాసంగా జరుగుతాయని వారు పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పురస్కరించుకుని పిల్లలు, యువతీ యువకులు, పెద్దలు, సీనియర్ సిటిజన్లకు ఇదే తమ ఆహ్వానమనీ... ఛైర్మన్, ప్రెసిడెంట్‌లు తెలియజేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ జానపద నృత్యం, దాని తరువాత యువత పాల్గొనే సాంస్కృతిక ప్రదర్శన ఉంటుందని వారు వివరించారు.

ఈపండుగ వేడుకల్లో పాల్గొనే పురుషులు సాంప్రదాయక దుస్తులను, మహిళలు పట్టుచీరలు, బాలికలు పట్టు పరికిణీలు, చిన్నారులు పట్టు వస్త్రాలు, పట్టు పంచెలు ధరించి వస్తే మంచిదని నిర్వాహకులు చెప్పారు. కాగా... ఈ వేడుకలలో పాల్గొనేవారికి రాత్రికి ఉచిత భోజన వసతిని కూడా కల్పించనున్నట్లు ప్రెసిడెంట్ బిక్షం, ఛైర్మన్ విజయ్‌లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu