Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘనంగా ముగిసిన ఘంటసాల ఆరాధనోత్సవాలు

Advertiesment
ఎన్ఆర్ఐ
అమెరికాలోని 30 ప్రధాన నగరాలలో స్వర్గీయ ఘంటసాల ఆరాధనోత్సవాలు దిగ్విజయంగా ముగిసినట్లు... ప్రముఖ సేవా సంస్థ వేగేశ్న ఫౌండేషన్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థలు వెల్లడించాయి. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల మే 10వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు జరిగాయి.

ఈ విషయమై వేగేశ్న ఫౌండేషన్ కమిటీ సభ్యుడు వంశీ కె. ధర్మారావు హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో మాట్లాడుతూ... ఘంటసాల ఆరాధనోత్సవాలు అమెరికాలోని హ్యూస్టన్, ఇండియానా, న్యూజెర్సీ, న్యూయార్క్, బోస్టన్, చికాగో, డెట్రాయిట్ లాంటి 30 నగరాలలో ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

జంట నగరాలకు చెందిన ప్రముఖ గాయకులు చంద్రతేజ, విజయలక్ష్మిలు ఘంటసాల ఆలాపించిన, బహుళ ప్రాచుర్యం పొందిన పాటలను పాడి.. అమెరికాలోని తెలుగు శ్రోతలను మంత్రముగ్దులను చేశారని వంశీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షార్లెట్ నగర మేయర్ ఆరాధనోత్సవాల నిర్వాహకులైన వంశీ రామరాజు, డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజులతో పాటుగా.. గాయనీ, గాయకులను ఘనంగా సత్కరించారని ఆయన వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu