ఎన్నారై రాజ్ షాపై హిల్లరీ క్లింటన్ ప్రశంసల వర్షం
అమెరికాలోని ఉన్నత ప్రభుత్వ పదవికి ఎంపికైన ప్రవాస భారతీయుడు రాజ్ షాపై అమెరికా విదేశాంగ శాఖా మంత్రి హిల్లరీ క్లింటన్ ప్రశంసల వర్షం కురిపించారు. కీలమైన అంతర్జాతీయాభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్) పదవికి ఎంపికైన రాజ్ షా కార్యదక్షను ఆమె కొనియాడారు.ఈ సందర్భంగా హిల్లరీ మాట్లాడుతూ.. ఈ పదవిలో నియమించేందుకు తగిన వ్యక్తి కోసం నెలల తరబడీ నిరీక్షించామనీ, ఎట్టకేలకు రాజ్ షా దొరికాడన్నారు. రాజ్ షా ఈ పదవికి అన్నివిధాలా తగిన వ్యక్తి అని, అతడు తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తాడనే నమ్మకం తమకుందని ఆమ పేర్కొన్నారు.కాగా.. రాజ్ షా నియామకాన్ని గత నెలలోనే అమెరికా సెనేట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. రాజ్ షా గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అభివృద్ధి, దౌత్యనీతి, వ్యూహాత్మక సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు.