Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆగని దాడుల పరంపర : మరో ముగ్గురికి గాయాలు

Advertiesment
ఎన్ఆర్ఐ
DBMG
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా జాత్యహంకారపు రక్కసి కోరలకు మరో ముగ్గురు భారతీయులు చిక్కి గాయపడ్డారు. ప్రస్తుతం దాడులు తగ్గుముఖం పట్టాయని, దాడుల అణచివేతకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ఆసీస్ ప్రభుత్వం ఎన్నిరకాలుగా ప్రకటించినా.. ఈ దాడులకు అడ్డుకట్ట పడే మార్గం కనిపించటం లేదు. పైగా రోజు రోజుకీ అవి తీవ్రమవుతున్నాయి.

సిడ్నీలోని ఓ హోటల్ వద్ద జరిగిన ఘర్ణలో గత వారం ఇద్దరు భారతీయ విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకునేలోపలే దుండగులు చల్లగా జారుకున్నారు. ఈలోపే బాధితులిద్దరూ వొల్లాంగ్ ఆసుపత్రిలో చేరినట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్ళారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి చర్య తీసుకోవద్దంటూ బాధితులిరువురూ తమను కోరినట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసు అధికారి బ్రియాన్ వైవర్ మీడియాకు వెల్లడించారు.

ఇక అడిలైడ్ నగరంలో జరిగిన మరో సంఘటనలో తప్పతాగిన నలుగురు గుర్తు తెలియని దుండగులు.. ఒక భారత విద్యార్థిపైకి దాడికి దిగి గాయపర్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా పలు రకాల సంఘటనలు వెలుగులోకి వస్తున్నా... తమ దేశం విదేశీ విద్యార్థులకు చాలా సురక్షితమైనదంటూ తెలియజెప్పేందుకు ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎవాన్స్ భారత్‌కు రానుండటం కాస్త విడ్డూరంగఅనిపించకమానదు...!!

Share this Story:

Follow Webdunia telugu