Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో భారత ఐటీ ఉద్యోగుల సమాఖ్య

Advertiesment
ఎన్ఆర్ఐ
FILE
అమెరికాలో భారత సంతతికి చెందిన ఐటీ ఉద్యోగులందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ఉద్దేశంతో "ఐటీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఐటీపీఐఓ)" పేరుతో ఓ సమాఖ్యను ఏర్పాటు చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సిలికాన్ వ్యాలీలో దీనిని ఏర్పాటు చేసినట్లు సమాఖ్య వ్యవస్థాపకుడు ఖాందరావుకంద్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఖాందరావుకంద్ మాట్లాడుతూ... ఓ ఒక్క సంస్థ తోడ్పాటు లేనప్పటికీ, భారతీయ సాంకేతిక నిపుణులు తమ రంగంలోని పనితీరుపట్ల అవగాహన పెంచుకుని అనేక విజయాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ఐటీ రంగానికి సంబంధించి ప్రపంచంలో నమోదవుతున్న ప్రతి విజయంలో భారతీయుల పాత్ర ఉండేందుకు కృషి చేయటమే ఈ సమాఖ్య ముఖ్యోద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఐటీ రంగంలోనే కాక, ఇతర రంగాల్లోని ప్రవాస భారతీయుల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు ఈ సమాఖ్య కృషి చేస్తోందని సిలికాన్ వ్యాలీకి చెందిన పిలాంథ్రోపిస్ట్, మైక్రోటెక్ సంస్థ సీఈఓ శ్రీచావ్లా ఈమేరకు తెలియజేశారు. కాగా... ప్రాథమికంగా నాయకత్వ, వ్యక్తిత్వ వృద్ధికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించే ఈ సంస్థ సిలికాన్ వ్యాలీతోపాటు డెన్వర్, వాషింగ్టన్, సియాటెల్, హైదరాబాద్, బెంగళూరులలో తన కార్యకలాపాలను ప్రారంభించడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu