భారతదేశానికి చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త అతుల్ ఖన్నాను ఫీన్‌లాండ్ ప్రభుత్వం తన అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. శాస్త్ర, వాణిజ్య రంగాలలో భారత్-ఫీన్‌లాండ్‌ల మధ్య సంబంధ బాంధవ్యాల మెరుగుదలకు కృషి చేసినందుకుగాను అతుల్‌ను "నైట్" పురస్కారంతో సత్కరించారు.
ఈ సందర్భంగా, సిస్టమ్స్ బయోలజీ వ్యవస్థాపకుడు, బోర్డు ఛైర్మన్ అయిన అతుల్ ఖన్నాను.. "నైట్"గా, "ఫస్ట్ క్లాస్"గా, "ఆర్డర్ ఆఫ్ ది లైన్ ఆఫ్ ఫీన్‌లాండ్" గా దేశాధ్యక్షుడు తార్జా హలోనెన్ ప్రకటించారు. హెల్సింకి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అతుల్‌కు "ఆర్డర్ టు" ప్రదానోత్సవం 35 వేల మంది విద్యార్థుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.
బయో టెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్ మార్ట్ శార్మాతో కలిసి అతుల్ ఇరు దేశాల మధ్య విద్యార్థుల మార్పిడి కార్యక్రమానికి తొలిసారి శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో యూనివర్సిటీ పేర్కొంది. టూల్ టెక్ గ్లోబల్ ఇంజనీరింగ్‌తో పాటు వివిధ సంస్థలను నెలకొల్పిన అతుల్ వాటిని విజయవంతంగా నిర్వహించారని ఫీన్‌లాండ్ అధికారులు ఒక ప్రకటనలో కొనియాడారు.