Publish Date: Fri, 08 Aug 2008 (17:57 IST)
Updated Date: Fri, 08 Aug 2008 (17:57 IST)
కావలసిన పదార్థాలు :
రొయ్యలు... అర కిలో
ధనియాలు... ఒక టీస్పూను
పసుపు... సరిపడా
కొత్తిమీర... ఒక కట్ట
నూనె... 100 గ్రాములు
ఉప్పు... సరిపడా
గుడ్లు... ఆరు
ఉల్లిపాయలు... ఆరు
పచ్చిమిర్చి... 50 గ్రాములు
దాల్చిన చెక్క... ఒక టీస్పూను
లవంగాలు... ఒక టీస్పూను
తయారీ విధానం :
ఉల్లి, మిర్చి, ధనియాలను విడివిడిగా నూరి పెట్టుకోవాలి. మిగిలిన మసాలాలన్నీ ముద్దగా చేసి ఉంచుకోవాలి. గుడ్లను ఒక గిన్నెలో కొట్టి సొన నురుగు వచ్చే వరకూ గిలకొట్టాలి. తరువాత పై రెండు ముద్దల్నీ మిశ్రమం చేయాలి. తరువాత దాల్చిన చెక్క పొడి, లవంగాలు, కొత్తిమీర తురుము, కొంచెం ఉప్పు వేసి మొత్తాన్ని కలపాలి.
ఈ మిశ్రమాన్ని శుభ్రంచేసి ఉంచుకున్న రొయ్యలకు బాగా పట్టించి గంటసేపు ఊరబెట్టుకోవాలి. తరువాత ఒక బాణాలిలో నూనె పోసి ఊరబెట్టిన రొయ్యల మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని అందులో వేసి పకోడీలలాగా వేయించుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.