Article Non Vegetarian %e0%b0%ac%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b0%95%e0%b0%be%e0%b0%af %e0%b0%ae%e0%b0%9f%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c 109060600119_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెండకాయ మటన్‌

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
మటన్... ఒక కేజీ
చింతపండు... రెండు నిమ్మకాయలంత
బెండకాయలు... అర కేజీ
ఉల్లిపాయలు... ఆరు
అల్లంవెల్లుల్లి ముద్ద... 4 టీ.
కారం... 4 టీ.
పసుపు... ఒక టీ.
పెరుగు... 4 టీ.
గరంమసాలా... ఒక టీ.
కొత్తిమీర తురుము... ఒక కప్పు
నూనె... ఒక కప్పు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
చింతపండులో కప్పు నీళ్లు పోసి పావుగంటసేపు నానబెట్టాలి. బెండకాయల ముందువెనకలు కోయాలి. బాణలిలో నూనె వేసి కాయల్ని వేయించి తీసి పక్కన ఉంచాలి. ఆ నూనెలోనే ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. అందులోనే ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి తిప్పాలి. మటన్ ముక్కల్ని కూడా వేసి, నీరు ఆవిరయ్యేదాకా ఉడికించాలి.

తరువావాత ఈ మొత్తాన్ని ప్రెషర్‌కుక్కర్‌లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. ముక్కలు ఉడికాక చింతపండు రసం, పెరుగు, బెండకాయ ముక్కలు వేసి అవసరమయితే మరికొన్ని నీళ్లు పోసి తక్కువ మంట మీద బెండకాయలు ఉడికేవరకూ ఉంచాలి. కాస్త గరంమసాలా, కొత్తిమీర తురుము చల్లి గ్రేవీగా ఉండగానే దించేయాలి.

Share this Story:

Follow Webdunia telugu