Article Non Vegetarian %e0%b0%9a%e0%b1%87%e0%b0%aa%e0%b0%b2 %e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80 107052500022_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేపల కర్రీ

Advertiesment
చేపలను శుభ్రం చేసుకుని ముక్కలు సిద్ధంగా ఉంచాలి
కావలసిన పదార్థాలు :


చేపలు : అరకిలో
నూనె : అయిదు టీ స్పూన్‌లు
ఉల్లిపాయలు : రెండు ముక్కలుగా చేసుకోవాలి
మిరియాలు : ఆరు
లవంగాలు : ఆరు
మొక్కజొన్న పొడి : ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్‌లు
కారంపొడి : మూడు టేబుల్ స్పూన్‌లు
పసుపు : చిటికెడు
ధనియాల పొడి : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు : రుచికి తగినంత
కొత్తిమీర ఆకులు : కొన్ని
నిమ్మరసం : ఒక టేబుల్ స్పూన్
టమేటో ప్యూరీ : ఐదు టేబుల్ స్పూనులు

ఇలా చేయండి :

చేపలను శుభ్రం చేసుకుని ముక్కలు చేసి సిద్ధంగా ఉంచాలి. ముందుగా దానికి నిమ్మరసం, మొక్కజొన్న పొడి, ఉప్పు కలిపి పట్టించి పక్కన పెట్టుకోవాలి. బాండీలో నూనె వేసి అందులో మిరియాలు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి బాగా వేయించాలి. ఆ తర్వాత టమోటో ప్యూరీ కూడా వేసి కొద్దిగా నీరు కలిపి బాగా ఉడికించాలి.

ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి దించే ముందు ధనియాల పొడి కొత్తిమీర వేసి దింపాలి. చేపల పులుసును వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది. మామూలుగా చింతపండుకి బదులుగా టమోటా ప్యూరీని వాడుకుంటే కూరకు రంగుతో పాటు రుచి వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu