కావలసిన పదార్థాలు :
ఉడికించిన చేపగుడ్లు... అర కేజీ
సెనగపిండి... అరకేజీ
బియ్యంపిండి... 50 గ్రా.
మంచినీళ్ళు... సరిపడా
నూనె... వేయించేందుకు తగినంత
నెయ్యి... వంద గ్రా.
జీడిపప్పు... వంద గ్రా.
ఉల్లితురుము... రెండు కప్పులు
కొత్తిమీర తురుము... ఒక కప్పు
పచ్చిమిర్చి తురుము... ముప్పావు కప్పు
అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టీ.
మసాలాపొడి... రెండు టీ.
కారం... రెండు టీ.
బేకింగ్ పౌడర్... కాస్తంత
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
ఉడికించిన చేపగుడ్లను పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో సెనగపిండి, బియ్యప్పిండి, ఉల్లి తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లంవెల్లుల్లి, మసాలాపొడి, కారం, బేకింగ్ పౌడర్, ఉప్పు, నెయ్యి అన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి గట్టి ముద్దలా కలిపి కొద్దిసేపు నానబెట్టాలి.
ఇప్పుడు బాణలిలో నూనెపోసి బాగా కాగుతుండగా... పై మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసి దోరరంగులో వేయించాలి. అంతే చేపగుడ్ల పకోడీ రెడీ అయినట్లే...! ఈ పకోడీలను వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటాయి.