పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే చీజ్ ఆమ్లెట్ ఎలా చేయాలో తెలుసా?
ముందుగా ఓ బౌల్‌లో కోడిగుడ్లను పగుల కొట్టి బాగా గిలకొట్టుకోవాలి. అందులోనే కాసింత ఉప్పు, పసుపు చేర్చి మరోసారి గిలకొట్టాలి. తర్వాత పాన్‌లో నూనె పోసి ఉల్లిముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆపై గరంమసాలా,
కోడిగుడ్డు, చీజ్ పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. చీజ్ పిల్లలకు ఇవ్వడం ద్వారా ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే చీజ్‌ను మితంగానే వాడాలి. అలాగే కోడిగుడ్డును రోజుకొకటి తీసుకుంటే.. ఓ రోజు సరిపడా శక్తిని అందిస్తుంది. అందుకే ఈ రెండింటి కాంబోలో వంటకాలు పిల్లలకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. సో వేసవి సెలవుల్లో ఇంట్లో వున్న మీ పిల్లలకు స్నాక్స్‌గా చీజ్ ఆమ్లెట్ ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు :
చీజ్ - అర కప్పు
కోడిగుడ్డు - ఐదు
గరంమసాలా - పావుటీస్పూను,
క్యాప్సికమ్ ముక్కలు - పావుకప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
నూనె, ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు,
తయారీ విధానం:
ముందుగా ఓ బౌల్‌లో కోడిగుడ్లను పగుల కొట్టి బాగా గిలకొట్టుకోవాలి. అందులోనే కాసింత ఉప్పు, పసుపు చేర్చి మరోసారి గిలకొట్టాలి. తర్వాత పాన్‌లో నూనె పోసి ఉల్లిముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆపై గరంమసాలా, పసుపు, కారం, కొత్తిమీర తురుము, అన్నీ వేసి కలిపి వేయించి తీసి గిలకొట్టిన గుడ్డుసొనలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోయాలి. రెండువైపులా కాలాక ఒకవైపున చీజ్ తురుము చల్లి అది కరిగేవరకూ సిమ్‌లో ఉంచి దించాలి. అంతే చీజ్ ఆమ్లెట్ రెడీ.