Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సండే స్పెషల్ వంటకం... రొయ్యల వేపుడు, ఆరోగ్య ప్రయోజనాలు...

Advertiesment
సండే స్పెషల్ వంటకం... రొయ్యల వేపుడు, ఆరోగ్య ప్రయోజనాలు...
, శనివారం, 21 మే 2022 (23:34 IST)
హార్మోన్ల సమస్యలతో బాధపడేవారు రొయ్యలు తింటుంటే శరీరంలో జీవక్రియలు సరిగ్గా నిర్వర్తింపబడుతాయి. ఆ సమస్య నుండి బయటపడవచ్చును. రొయ్యలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చేస్తాయి. దాంతోపాటు శరీరానికి కావలసిన పోషక విలువలను పుష్కలంగా అందిస్తాయి.

 
రొయ్యలో ఉండే ప్రోటీన్స్ శరీరంలో కండరాల నిర్మాణానికి, కొత్త కణజాలం ఏర్పాటు అయ్యేందుకు ఉపయోగపడుతుంది. రొయ్యల్లో శరీరానికి అవసరమయ్యే జింక్, సెలీనియం, కాపర్, మెగ్నిషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉన్నందువలన వీటిని తింటే మన శరీరానికి పోషణ లభిస్తుంది. కనుక వారంలో ఒక్కసారైన రొయ్యలతో తయారుచేసిన ఆహార పదార్థాలు తింటే ఫలితం ఉంటుందని వారు చెప్తున్నారు. 

 
రొయ్యలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఆపై వీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి కొద్దిగా నీరుపోసి బాగా ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తరువాత నీటిని వంపుకుని వాటిలో కొద్దిగా కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కేసరి పొడి వేసి కలుపుకుని ఓ 20 నిమిషాలపాటు అలానే ఉంచాలి. ఆ తరువాత బాణలిలో నూనెను వేడిచేసి అందులో ఈ రొయ్యలు వేయించుకోవాలి. ఈ తయారుచేసిన రొయ్యలు తరచు తింటే శరీరంలో రక్తం బాగా తయారవుతుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

International Tea Day: ఈ 10 రకాల టీలను తాగి చూడండి