Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వింటర్లో రొయ్యల ఆవకాయ టేస్ట్ చేయండి!

వింటర్లో రొయ్యల ఆవకాయ టేస్ట్ చేయండి!
, శుక్రవారం, 26 డిశెంబరు 2014 (17:52 IST)
వింటర్లో స్పైసీ రొయ్యల ఆవకాయ టేస్ట్ చేస్తే.. సూపర్‌గా ఉంటుంది. రొయ్యల్లోని క్యాల్షియం లాంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక రొయ్యల ఆవకాయ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
రొయ్యలు : కేజీ 
నూనె : అర కేజీ 
పచ్చి కారం : 100 గ్రాములు 
ఆవపిండి : 50 గ్రాములు 
మెంతిపిండి : 50 గ్రాములు 
వెల్లుల్లి : నాలుగు రెబ్బలు 
పసుపు : ఒక స్పూన్ 
నిమ్మరసం : అర కప్పు
 
తయారీ విధానం:  
రొయ్యల్ని వొలిచి కడిగి శుభ్రంగా పిండి ఒక పాత్రలో పెట్టుకోవాలి. ఒక కళాయిలో సగం నూనెపోసి బాగా కాగాక రొయ్యలు వేసి ఎర్రగా వేపి దింపేసి ఒక పాత్రలో వేసి చల్లారనివ్వాలి. ఆ కళాయిని పొయ్యిమీద పెట్టి మిగిలిన నూనెనూ- మసాలాలన్నీ మిశ్రం చేసి అందులో వేసి వేపి చల్లారిన రొయ్యల్ని వేసి- రొయ్యల్ని బాదా కలిపి ఒక జాడీలో పెట్టుకోవాలి. మర్నాడు రుచి చూసుకుంటే సరిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu