మటన్‌ను తీసుకుంటే లో బ్లడ్ ప్రెషర్‌కు చెక్ పెట్టవచ్చు. బ్లడ్ ప్రెషర్‌ను పెంచే మటన్‌లో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇనుము, విటమిన్ బి వుండే మటన్‌ను పిల్లలకు తినిపిస్తే వారిలో పెరుగుదలకు ఢోకా ఉండదని న్యూట్రీషన్లు అంటున్నారు. సో మటన్‌తో గ్రేవీలే కాకుండా వైరైటీగా పులావ్ ట్రై చేయండి
కావలసిన పదార్థాలు :
మటన్ : కేజీ
బాస్మతి రైస్ : ఒకటిన్నర కేజీ
కొబ్బరి- ఒకటి
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - అరకప్పు
పుదీనా, కొత్తిమీర - ఒక కప్పు
దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు - ఒక్కో స్పూన్
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్,
జీడిపప్పు - పావు కప్పు
ఉప్పు, నూనె - తగినంత
పచ్చిమిర్చి -10
ఉల్లిపాయలు - ఐదు
తయారీ విధానం :
ముందుగా బాస్మతి రైస్‌ను అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత గసగసాలు నూనె లేకుండా వేపి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిని పేస్ట్ చేసుకోవాలి. గసగసాలు, పచ్చికొబ్బరి పేస్ట్‌లా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి5. ఉల్లిపాయలను తరిగి పక్కన పెట్టుకోవాలి.
పుదీనా, కొత్తిమీర, మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. శుభ్రం చేసిన మటన్‌ను పసుపు, ఉప్పు వేసి ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి. ఒక పెద్ద గిన్నెను స్టౌ మీద పెట్టి అందులో నెయ్యి వేసి ఉల్లిపాయముక్కలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి.
ఇవి వేగుతుండగా జీడిపప్పు, పుదీన, కొత్తిమీర, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికొబ్బరి, గసగసాల పేస్ట్, బిర్యాని ఆకు, పెరుగు వేసి కొంచెం నూనె వేసి బాగ వేగనివ్వాలి.
తరువాత ఉడికించి పెట్టుకున్న మటన్ వేగుతున్నమసాలలో వేసి కలిపి, నాన పెట్టుకున్న బాస్మతి బియ్యాని కూడ వేసి ఆరు గ్లాసుల నీళ్ళు లేదా కొబ్బరి పాలు వేసుకుని నాలుగు వైపుల కలిపి ఉప్పు, కారం రుచి చూడాలి. ఓ పది నిమిషాలు రైస్‌ను ఉడికించి దించేయాలి.