ఈ వీకెండ్ ఉప్పు చేప కూర ట్రై చేయండి. చేపలో ఎన్నో పోషకాలున్నాయి. వారంలో రెండుసార్లు చేపలు తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. అలాంటి ఉప్పు చేపలతో కూర ఎలా చేయాలో ట్రై చేద్దాం.
కావలసిన పదార్థాలు :
ఉప్పు చేప... అరకేజీ
పచ్చిమిర్చి... ఎనిమిది
కొత్తిమీర... ఒక కట్ట
ఉప్పు... తగినంత
ఉల్లిపాయలు... మూడు కప్పులు
మంచి నూనె... 150 గ్రాములు
కారం... నాలుగు స్పూన్లు
తయారీ విధానం :
ఒక బాణలిలో నూనె పోసి అందులో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగుల్ని వేసి బాగా వేయించాలి. అవివేగాక అందులో ఉప్పు చేపలను వేసి వేయించండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవి వేగిన తరువాత కాస్తంత ఉప్పు, కారం చేర్చి చేపలు ఉడేకే మోతాదు నీటిని చేర్చి ఉడికించండి. చేపలు ఉడికాక అందులో కొత్తిమీర తరుగును చేర్చి దింపేయండి. అంతే ఉప్పుచేప కూర రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి టేస్టీగా ఉంటుంది.