చికెన్ మటన్ కంటే, సీఫుడ్‌లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాలరీలు తక్కువ, ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల గుండెకు చాలా మంచి ఆహారం. చేపలతో వివిధ రకాల వంటలను వండుకోవచ్చు. గ్రేవీ, పులుసు, చేపల వేపుడు, ఫిష్ బిర్యానీ ఇలా వివిధ రకాలుగా తయారుచేసుకుంటారు. ఫిష్ తో ఫిష్ 65 ట్రై చేసి చూశారా? ఇంకెందుకు ఆలస్యం ఈవెనింగ్ స్నాక్‌గా లేదంటే సైడిష్‌గా కూడా ఫిష్ 65ని ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు :
చేప ముక్కలు : ఆరు
పెప్పర్ : చిటికెడు
గుడ్డు : రెండు
మైదా : రెండు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్
కారం : రెండు టీ స్పూన్లు
గరం మసాలా పౌడర్ : ఒక టీస్పూన్
ధనియాల పొడి : కొద్దిగా
ఉప్పు,నూనె : తగినంత
తయారీ విధానం :
ముందుగా శుభ్రం చేసుకున్న చేపముక్కల్ని ఓ బౌల్‌లోకి తీసుకుని నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత గుడ్డును కూడా పగలగొట్టి, పచ్చసొనతో పాటు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో చేప ముక్కలన్నింటినీ వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇలా మసాలా పట్టించిన చేపముక్కలను అరగంట పాటు ఫ్రిజ్‌లో పెడితే మరింత టేస్ట్ ఉంటుంది. అరగంట తర్వాత ఫ్రిజ్‌లో నుండి బయటకు తీసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైయింగ్ పాన్‌లో నూనె వేసి, వేడయ్యీక, చేప ముక్కలను నూనెలో వేసి అతి తక్కువ మంట మీద ఇరువైపులా దోరగా వేపుకోవాలి. అంతే ఫిష్ 65 రెడీ.ఈ ఫిష్ 65ని పప్పుచారుకు సైడిష్‌గానూ ఉపయోగించుకోవచ్చు.