Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పెర్మ్ కౌంట్‌ను పెంచే క్యారెట్‌తో చికెన్ గ్రేవీ ఎలా చేయాలో తెలుసా?

క్యారెట్ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలోని స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. సంతాన లేమి సమస్యతో బాధపడేవారు క్యారెట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం ఉంటుందని.. అంతేకాకుండా క్

Advertiesment
స్పెర్మ్ కౌంట్‌ను పెంచే క్యారెట్‌తో చికెన్ గ్రేవీ ఎలా చేయాలో తెలుసా?
, బుధవారం, 27 జులై 2016 (12:23 IST)
క్యారెట్ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలోని స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. సంతాన లేమి సమస్యతో బాధపడేవారు క్యారెట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం ఉంటుందని.. అంతేకాకుండా క్యారెట్ తినడం ద్వారా చర్మం కూడా నిగనిగలాడి వృద్ధాప్య ఛాయలు దరిచేరవని పోషకాహార నిపుణులు అంటున్నారు. అలాంటి క్యారెట్‌తో చికెన్ గ్రేవీ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
చికెన్ ముక్కలు : అర కేజీ 
ఉల్లిపాయ తరుగు : అర కప్పు 
క్యారెట్ తరుగు : ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్ 
పసుపు : కొద్దిగా,
ఉప్పు : తగినంత, 
మిరియాల పొడి : ఒక స్పూన్, 
నూనె : తగినంత 
కొత్తిమీర తరుగు : పావు కప్పు
గరం మసాలా : అర చెంచా 
 
తయారీ విధానం :
బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేపాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పొడి, చికెన్ ముక్కలు వేసి.. నీళ్లు పోసి మూత పెట్టాలి. ఐదు నిమిషాలయ్యాక క్యారెట్‌ ముక్కలు, తగినంత ఉప్పు, గరంమసాలా వేసి మళ్లీ మూతపెట్టాలి. బాగా ఉడికాక గ్రేవీలా తయారయ్యాక.. పైన కొత్తిమీర తరుగు చల్లి బ్రెడ్‌తో కలిపి సర్వ్ చేస్తే క్యారెట్ విత్ చికెన్ గ్రేవీ రెడీ అయినట్లే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏసీ కింద కూర్చుని పనిచేస్తున్నారా? గంటకోసారి అర గ్లాసు నీరైనా తాగండి!