Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూఇయర్: థీమ్ డ్రెస్‌ల ప్రతిరూపం

Advertiesment
ఇతరాలు వెబ్దునియా స్పెషల్ 2009 దుస్తులు డ్రస్ కోడ్ బాలీవుడ్ తారలు గాయకులు సంగీతం నృత్యం
, బుధవారం, 31 డిశెంబరు 2008 (21:13 IST)
నూతన సంవత్సరం సందర్భంగా కేవలం ఈ సంబరం జరుపుకోవడానికే ఉద్దేశించిన ప్రత్యేక, రంగుల దుస్తులలో జనం కనిపించడం ఎక్కువైంది. కలర్ కోడ్ కానివ్వండి, మ్యాచింగ్ డ్రెస్ కానివ్వండి.. థీమ్ డ్రెస్సింగ్ అనేది కొత్త సంవత్సర మూడ్‌ను రానురాను ప్రజలలో వ్యాప్తి చేస్తూ సంవత్సరం తొలిరోజును విశిష్ట డ్రెస్ కోడ్‌ల మయంగా చేయడం ఇటీవలి సంవత్సరాలలో పెరిగింది.

వెలిగిపోయే దుస్తులు, దేదీప్యమానంగా వెలిగే దీపకాంతులు, అదిరేటి డ్రెస్, నవ తరం నూతన కాంక్షలు ఒక్కటేమిటి.. ఆనందం పరవళ్లు తొక్కుతూ కనిపించే న్యూ ఇయర్ సంరంభాలకు బాలీవుడ్ మొదలుకుని అన్ని భాషా చిత్రాల నటీ నటులు, వృత్తినిపుణులైన డ్యాన్సర్లు, గాయకులు తమ సంగీత, నృత్య కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంటారు.

మంచి సంగీతం, డ్యాన్స్, రుచికరమైన భోజనం, బాణాసంచా ప్రతి ఒక్కటీ దేనికదే సాటిగా డిసెంబర్ 31 చివరి క్షణాలు సాఫీగా, సరదాగా, నయనానందకరంగా సాగిపోతుంటాయి. రద్దీగా ఉండే ప్రాంతాలను భరించలేని వారు తమ ప్రయివేట్ పార్టీలను చిన్న, పెద్ద బృందాలుగా ఏర్పడి ఆట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటుంటారు.

Share this Story:

Follow Webdunia telugu