Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీకి వంట చేయడం అంటే చాలా ఇష్టమట.!

మోడీకి వంట చేయడం అంటే చాలా ఇష్టమట.!
, సోమవారం, 26 మే 2014 (18:50 IST)
FILE
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వంట చేయడం అంటే చాలా ఇష్టమట. ప్రత్యేకంగా గుజరాతీ స్పెషల్ వంటకాల తయారీలో అందెవేసిన చేయి. పుల్కాలు, బటాటా పోహా, సబుదానా కిచిడీ వంటివి అత్యంత రుచికరంగా చేస్తారు.

* దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులూ మోడీ ఉపవాసం చేస్తారు. గుజరాత్‌లోని అంబాజీ పట్ణంలో కొలువై ఉన్న అంబాజీ మాత (దుర్గాదేవి) అంటే మోడీకి ఎంతో భక్తి. అందుకే.. ఆ ఊళ్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 51 శక్తిపీఠాల నమూనాలను నిర్మింపజేశారు.

* రోజూ ఉదయాన్నే ఏడుగంటలకు ఇంటర్‌నెట్ చూస్తారు. వివిధ పత్రికల్లో, వెబ్‌సైట్లలో తనపై వచ్చిన వార్తలను చదువుతారు. వేరే ఊళ్లల్లో ఉన్నా, ఆ సమయానికి ప్రయాణంలో ఉన్నా ఈ రొటీన్ తప్పనిసరి.

* నెట్ చూడటం, పేపర్ చదవడం పూర్తయ్యాక పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. తన అనుచరులు, మంత్రివర్గ సహచరులతో ఫోన్‌లో సంప్రదిస్తారు. వీలైనంత త్వరగా కార్యాలయానికి చేరుకుని రాత్రి 10 గంటల దాకా అక్కడే ఉంటారు. అవసరమైతే మరికొద్ది సేపూ ఉంటారు.

* మోదీ నిద్రించే సమయం తక్కువ. రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా తెల్లవారుజామున ఐదు-ఐదున్నరకు మేలుకుంటారు.

* తన ఆహార్యంపైన అత్యంత శ్రద్ధ చూపుతారు. అద్దం ముందు నిలబడి తన ఆహార్యాన్ని పూర్తిగా పరిశీలించుకుని సంతృప్తి చెందాకే బయటికొస్తారు. మోడీ ప్రచార కార్యాలయం నుంచి మీడియాకు చేరే ప్రతి ఫొటో ఆయన ఆమోదం పొందాకే బయటకు వస్తుంది.

* ఆయన ప్రయాణించే కారులో వెనకసీటులో రంగురంగుల ఉత్తరీయాలు, స్కార్ఫ్‌లు ఉంటాయి. సందర్భాన్ని బట్టి వాటిలో ఒకదాన్ని తీసుకుని మెళ్లో వేసుకున్నాకే కారు దిగుతారు.

* కవిత్వం అంటే ఇష్టం. ఎప్పుడో రాస్తారు. ఆయన కవిత్వం అంత బాగోదని సన్నిహితులు అంటుంటారు. అలాగే ఫొటోగ్రఫీ అన్నా మోడీకి ఇష్టమే.

* మోదీకి మడత నలగని దుస్తులు ధరించడమంటే ఇష్టం. మరీ చిన్నప్పుడు కాదుగానీ.. 15-16 ఏళ్ల వయసు నుంచీ చెంబు ఇస్ట్రీ చేసుకున్నాకే దుస్తులు వేసుకునేవారట.

అంచెలంచెలుగా ఎదిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్‌ను అభివృద్ధి పరిచినట్లు దేశాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తారని ఆకాంక్షిద్దాం..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం!