Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గజరాజు పోతుంటే కుక్కలు మొరుగుతాయి.... జేసీ ప్రభాకర్ కామెంట్స్‌పై జగన్ స్పందన

తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గజరాజు పోతుంటే కుక్కలు మొరుగుతాయన్న చందంగా ప్రభాకర్ వ్యాఖ్యలు ఉన్నాయని వ్యాఖ్యానించార

గజరాజు పోతుంటే కుక్కలు మొరుగుతాయి.... జేసీ ప్రభాకర్ కామెంట్స్‌పై జగన్ స్పందన
, మంగళవారం, 7 మార్చి 2017 (10:49 IST)
తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గజరాజు పోతుంటే కుక్కలు మొరుగుతాయన్న చందంగా ప్రభాకర్ వ్యాఖ్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన విషయంతెల్సిందే. దీనిపై జగన్ తనదైనశైలిలో స్పందించారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. పరుష పదజాలాన్ని ఉపయోగించి బూతులు తిట్టారు. ఈ వ్యాఖ్యలపై జగన్ విజయవాడలో పై విధంగా స్పందించారు.
 
ఇకపోతే... 'ప్రతిపక్ష నేతగా కలెక్టర్‌, ఎస్పీ కంటే హోదాలో నేను పెద్దవాడిని. బాధితుల పక్షాన నిలవాల్సిన కలెక్టర్‌ తన బాధ్యతను విస్మరించి.. వాస్తవాలను మరుగున పరిచేలా వ్యవహరిస్తుంటే.. జైలుకు పోతావని హెచ్చరించాను. ఇందులో తప్పేముంది'? అని జగన్‌ ప్రశ్నించారు. గజరాజు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయని ఆ విధంగానే జేసీ ప్రభాకర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. 
 
ఇకపోతే... రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మోసం చేశారని... లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపులంటూ తన బినామీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బంధువులకు వాణిజ్య సముదాయాలకు సమీపంలోనూ రోడ్ల కూడళ్లను ఆనుకుని ప్లాట్లు వచ్చేలా చేశారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు వాణిజ్య కూడళ్లకు మధ్యలో 12000 చదరపు గజాల ప్లాట్లు ఇచ్చారని ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకుల తీరుపై ప్రజాగ్రహం.. వేతన ఖాతాలు ఖాళీ చేస్తాం .. ఏప్రిల్‌ 6న నో ట్రాన్సాక్షన్‌ డే