Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుక్కల కోసం ఇంటిని అమ్మేసిన యువకుడు

Advertiesment
Dogs

ఠాగూర్

, ఆదివారం, 16 మార్చి 2025 (17:57 IST)
పిల్లలు చదువులు, ఆరోగ్య ఖర్చులు కోసం ఆస్తులను అమ్మేసిన వాళ్ళను మనం చూశాం. పేకాట, గుర్రపు పందేల లాంటి వ్యసనాల్లో చిక్కి ఆస్తులు ఆమ్మేసిన వాళ్ళ గురించి విన్నాం. కానీ, 31 యేళ్ల యువకుడు గోమతి శంకర్ వీధి కుక్కల కోసం సొంతింటిని అమ్మేశాడు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా నలుమూలలా మనుషులు దాడి, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వీధి కుక్కలను చేరదీసి, తగిన చికిత్స అందిస్తున్నాడు. కుక్కలను పెంచుతున్నాడంటూ గోమతి శంకర్‌కు పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. అయినా తాను ఎంచుకున్న మార్గంలో ఆయన అలుపెరగకుండా పయనిస్తున్నాడు. 
 
గోమతి శంకర్ తిరునల్వేలి జిల్లాలోని వీరవనల్లూరు గ్రామానికి చెందినవాడు. ఈయన తల్లిదండ్రుల పేర్లు మురుగన్ (70), మూకమ్మల్ (70). మురుగన్ తమిళనాడు రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థలో టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్మ్ అయ్యారు. ఏకైక కుమారుడు కావడం వల్ల గోమతి శంకర్‌ను అల్లారుముద్దుగా పెంచారు. శంకర్ డిప్లొమా పూర్తి చేసి రెండేళ్లు విదేశాల్లో పనిచేశారు. ఆ తర్వాత సొంతూరికి తిరిగొచ్చిన ఆయన లారీ డ్రైవర్‌గా పని చేయసాగాడు. ఈ క్రమంలో 2020 సంవత్సరంలో కరోనా సంక్షోభ సమయంలో గోమతి శంకర్ తన ఇంటి దగ్గర వీధి కుక్కలను చేరదీసి అన్నం పెట్టేవాడు. తద్వారా అతడికి కుక్కల పెంపకంపై ఆసక్తి పెరిగింది. 
 
నిత్యం కుక్కల పెంపకంతో బీజీగా గడుపుతుండటం వల్ల గోమతి శంకర్‌కు పెళ్లి సంబంధాలు కుదరడం కూడా కష్టతరంగా మారింది. ఈ విషయంలో శంకర్ తల్లిదండ్రులు బాగా బాధపడ్డారు. అయినా తమ కుమారుడు ఆసక్తిని, సేవా భావాన్ని అడ్డుకోలేకపోయారు. వీరవనల్లూరు గ్రామంతో పాటు గత నాలుగేళ్లుగా తిరునెల్వేలి, తెన్‌కాశి, తూత్తుక్కడి, కన్యాకుమారి జిల్లాల్లోనూ శంకర్ పర్యటించారు. మనుషుల దాడిలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఎన్నో కుక్కలకు చికిత్స అందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనం కోసం పుట్టిన పార్టీ ఇపుడు ఆంధ్ర మత సేనగా మారిపోయింది : షర్మిల