Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ నిర్భయ రేపిస్టు మామూలోడు కాదు.. 21 ఏళ్ల నేరగాడికి జిహాదీ సంస్థతో సంబంధాలున్నాయా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చినా దేశంలో మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. తాజాగా ఢిల్లీ నిర్భయ కేసు రేపిస్టు గురించిన

ఢిల్లీ నిర్భయ రేపిస్టు మామూలోడు కాదు.. 21 ఏళ్ల నేరగాడికి జిహాదీ సంస్థతో సంబంధాలున్నాయా?
, గురువారం, 30 జూన్ 2016 (10:29 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చినా దేశంలో మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. తాజాగా ఢిల్లీ నిర్భయ కేసు రేపిస్టు గురించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో జువెనైల్ నేరగాడని ముద్రపడిన రేపిస్టు మామూలోడు కాదని... అతడికి ప్రమాదకరమైన జిహాదీ సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రస్తుతం 21 ఏళ్ళ వాడైన ఈ నేరగాడి కదలికలపై నిఘా పెట్టాల్సిందిగా ఉత్తర ప్రదేశ్‌లోని అధికారులకు కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థలు సూచించాయి. యూపీ‌లోని బాదౌమ్ జిల్లాకు చెందిన ఇతడి పేరు ఇప్పటివరకు బయటపడలేదు. ఢిల్లీలో బస్సులో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన నాటికి వీడికి 18 ఏళ్ళు. మైనర్ అన్న కారణంగా ఇతడిని జువెనైల్ హోమ్‌కి తరలించిన సంగతి తెలిసిందే. 
 
అయితే ఆరు నెలల క్రితం ఇతడిని విడుదల చేశారు. 2011లో ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బాంబు పేలుడులో నిందితుడైన కాశ్మీరీ జిహాదీతో ఇతనికి స్నేహం ఏర్పడింది. ఏడాది కాలంగా వీళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారు. వేర్పాటువాద కాశ్మీరీలకు మద్దతు ఇవ్వాలని ఆ కుర్ర జిహాదీ ఈ రేపిస్టును ప్రోత్సహిస్తూ వచ్చాడని తెలిసింది. దీంతో ఇతడు వేర్పాటువాద కార్యకలాపాల పట్ల ఆకర్షితుడయ్యాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇరాక్‌లో అమెరికా బాంబుల వర్షం... 250 మంది ఐఎస్ ఉగ్రవాదుల హతం