Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైనికులపైకి రాళ్లు విసురుతారు..మావద్దకు చికిత్సకు వస్తారు పోవయ్యా అన్న ఆ డాక్టర్

తమ వద్దకు వచ్చిన రోగులను పూర్వాపరాలతో పనిలేకుండా చికిత్స్ చేయడం వైద్యు విధి అనే హిపోక్రాటిక్ ప్రమాణాన్ని గాలికి వదిలేసిన ఆ డాక్టర్ రోగిని ఈసడించుకోవడంతో తీవ్ర విచారంతో రోగి కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన కశ్మీరులో సంచలనం కలిగిస్తోంది. పైగా వీధ

Advertiesment
pelt stones
హైదరాబాద్ , సోమవారం, 8 మే 2017 (08:29 IST)
తమ వద్దకు వచ్చిన రోగులను పూర్వాపరాలతో పనిలేకుండా చికిత్స్ చేయడం  వైద్యు విధి అనే హిపోక్రాటిక్ ప్రమాణాన్ని గాలికి వదిలేసిన ఆ డాక్టర్ రోగిని ఈసడించుకోవడంతో తీవ్ర విచారంతో రోగి కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన కశ్మీరులో సంచలనం కలిగిస్తోంది. పైగా వీధుల్లో సైనికులపై రాళ్లు విసురుతారు. మా వద్దకు ట్రీట్‌మెంటుకు వస్తారు పోవయ్యా అని వైద్యుడు ఈసడించడం వైద్య ప్రమాణాలకే భంగకరమని నిపుణుల వ్యాఖ్య.
 
శ్రీనగర్‌కు చెందిన 55 ఏళ్ల నస్రీనా మాలిక్ మెదడులో రక్తనాళాలు దెబ్బతిని విలవిల్లాడుతూ న్యూరో సర్జికల్ ఆపరేషన్‌ చేసుకోవాలని వైద్యుడివద్దకు వస్తే అతడు ఘోరంగా వారిని అవమానించాడు. దీంతో ఆ డాక్టర్ దుష్ప్రవర్తనకు, చికిత్సకు అయ్యే ఖర్చుకు సంబంధించి తప్పు సమాచారాన్ని ఇచ్చినందుకు బాధపడి ఆ రోగి కుటుంబం అక్కడినుంచి వెళ్లిపోయింది 
 
నస్రీన్ కుమారుడు జావిద్ మాలిక్ మీడియాకు చెప్పిన సమాచారం ప్రకారం చంఢీగర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ అండ్ రీసెర్చ్ (పిజిఐఎమ్ఇఆర్) కేంద్రంలో డాక్టర్ మనోజ్ తివారీ కేబిన్‌లోకి వారు వెళ్లగానే ఆయన చాలా మర్యాదగా రమ్మని పిలిచి పరీక్ష ప్రారంభించాడట. కానీ తల్లి కేస్ హిస్టరీ అడిగి తీసుకుని చూసిన వెంటనే వారు కశ్మీరీలని తెలియగానే ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. 
 
కోపంతో రోగి డాక్యుమెంట్లను విసిరి కొట్టి సైనికులపై రాళ్లు విసురుతారు. మా వద్దకు ట్రీట్‌మెంటుకు వస్తారు పోవయ్యా అనేశాడట. పైగా సర్జరీకి 15 లక్షల ఖర్చవుతుందని తప్పు సమాచారం చెప్పాడని కాని ఇతర రోగులు దానికి మందులు, ఇతర ఖర్చులన్నీ కలిపి 80 వేల రూపాయలు మాత్రమే అవుతుందని చెప్పారని జావిద్ తెలిపాడు. పైగా ఢిల్లీలోని ఎయమ్స్ వద్దకు వెళ్లండి అని డాక్టర్ సలహా ఇచ్చాడని చెప్పాడు. 
 
డాక్టర్ దుష్ప్రవర్తన, తప్పు సమాచారం కారణంగా ఆ సాయంత్రమే నా తల్లితో పాటు అక్కడినుంచి వచ్చేశానని ఇప్పుడు డిల్లీకి వెళ్లాలని ఆలోచిస్తున్నానని జావిద్ చెప్పాడు. కానీ ఆసుపత్రిలో వారు ఫిర్యాదు చేయలేదు. అయితే ఆ ఆసుపత్రి డైరెక్టర్ జగత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ రోజు కశ్మీర్ నుంచి వందలాది మంది రోగులు తమ వద్దకు చికిత్సకోసం వస్తుంటారని, కాని జావీద్ చెప్పినట్లుగా అలాంటి ఘటన జరిగి ఉంటే తప్పకుండా విచారణ జరుపుతామని జగత్ రామ్ చెప్పారు.
 
అయితే ఈ వార్తను శ్రీనగర్‌కు చెందిన ఇంగ్లీష్ పేపర్‌లో రాగానే ఆ డాక్టర్ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆసుపత్రులలో కూడా జాతీయవాదం జొరబడిందని వ్యాఖ్యానించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏయ్ ఎస్పీ హద్దు మీరొద్దు.. బీజేపీ నేత ధాష్టీకంతో కన్నీరు పెట్టుకున్న మహిళా ఎస్పీ