Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీలో కీచకపర్వం : మహిళా అభ్యర్థికి చీరలాగిన పోలీసులు

Advertiesment
యూపీలో కీచకపర్వం : మహిళా అభ్యర్థికి చీరలాగిన పోలీసులు
, శనివారం, 10 జులై 2021 (08:10 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కీచకపర్వం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళా అభ్యర్థి చీరను సాక్షాత్ పోలీసులే లాగేశారు. ఇది తీవ్ర సంచలనం కావడంతో ఆ ఐదుగురు పోలీసులపై యూపీ సర్కారు తక్షణం వేటు వేసింది. 
 
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా లఖింపూర్‌ ఖేరీ ప‌రిధిలో చివరి రోజైన నిన్న నామినేషన్ వేసేందుకు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ మహిళ  వెళ్లగా ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డుకుని, ఆమె చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కుని, చీర పట్టుకుని లాగారు. అక్కడే ఉన్న కొందరు వచ్చి ఆమెను విడిపించారు.
 
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. యూపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. 
 
బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార దాహంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గూండాలే ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు.
 
మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఓ సీఐ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తగ్గిన పసిడి ధర : కిలో వెండిపై రూ. 559 డౌన్