Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకే ఒక్కడులా యోగి స్పీడ్.. దమ్ముంటే కాచుకో అంటున్న ఐసిస్

అధికారంలోకి వచ్చినది మొదలుగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొరడా మీద కొరడా ఝళిపిస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని, బీజేపీ అధ్యక్షుడిని కలిసి వచ్చిన తర్వాత యోగ శరవేగంగా పావులు కదుపుతున్నారు. జంతువధశాలల మూసివేతకు కార్యాచరణ ప్రణాళికను రూపొ

ఒకే ఒక్కడులా యోగి స్పీడ్..  దమ్ముంటే కాచుకో అంటున్న ఐసిస్
హైదరాబాద్ , గురువారం, 23 మార్చి 2017 (07:31 IST)
అధికారంలోకి వచ్చినది మొదలుగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొరడా మీద కొరడా ఝళిపిస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని, బీజేపీ అధ్యక్షుడిని కలిసి వచ్చిన తర్వాత యోగ శరవేగంగా పావులు కదుపుతున్నారు. జంతువధశాలల మూసివేతకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పోలీసు అధికారులను  ఆదేశించారు. గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం విధిస్తూ ఆదేశాలిచ్చారు. అన్ని అక్రమ కబేళాలను మూయించి వేస్తామని, యంత్రాలతో నడిచే కబేళాలపై పూర్తి నిషేధం విధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు తొలిరోజునుంచే యోగి పథకం ప్రకారం ముందుకెళుతున్నారు, ఈ నేపథ్యంలో మీరట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు మూడు మాంసం దుకాణాలకు నిప్పుపెట్టారు. 
 
మహిళల భద్రత కోసం యాంటీ–రోమియో స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్టు యోగి ప్రభుత్వం ప్రకటించిందే తడవు..  లక్నోలో మహిళలను వేధిస్తూ కనిపించిన పలువురిని ఈ బృందాలు అరెస్టు చేశాయి. పాఠశాలలు  కళాశాలలు, దుకాణాల దగ్గర పోలీసు బృందాలు నిరంతరం గస్తీ తిరుగుతూ ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈవ్‌టీజర్లను గూండా చట్టం కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. పాలకుడు మారినప్పుడు మాత్రమే జరిగే ఈ మార్పులను చూసి జనం నివ్వెరపోతున్నారు. కుర్రాళ్లు ఆవేశంలో ఏదో చేస్తారు. అన్నిటినీ పట్టించుకుంటే ఎలా అంటూ గతంలో ములాయం సింగ్ వంటి పెద్ద మనిషి ఆకతాయిలను, రేపిస్టులను బహిరంగంగా సమర్థించిన వైనం చూస్తే యూపీలో ప్రస్తుతం జరుగుతున్న ఆకస్మిక మార్పులు షాక్ కలిగిస్తున్నాయి. 
 
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అన్ని విద్యాసంస్థలు, ఆస్పత్రులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్‌ మసాలా, గుట్కా, సిగరెట్‌ వంటి పొగాకు ఉత్పత్తులను యూపీ ప్రభుత్వం నిషేధించింది. ఉద్యోగులు, సిబ్బంది ఇలాంటి వాటిని ఉపయోగించొద్దని, పర్యావరణం కోసం ప్లాస్టిక్‌ వాడకాన్ని మానుకోవాలని స్పష్టం చేసింది. పాత సచివాలయంలోని ఒక భవనం గోడలపై పాన్‌ మరకలు ఉండటాన్ని చూసి ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 
యోగి ఇంత స్పీడ్‌గా పాలనలో తనదైన మార్పులు చేసుకుంటూ పోతూ ఉంటే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కి రుచించనట్లుంది. ఇస్లామికి్ స్టేట్ సభ్యులమని చెప్పుకుంటూ గుర్తు తెలియని వ్యక్తులు  సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు హెచ్చరిక పంపారు. ఈ నెల 24న పూర్వాంచల్‌లో జరిగే హింసను దమ్ముంటే అడ్డుకోండంటూ సవాల్‌ విసిరారు. వారణాసిలోని మీర్జామురాద్‌ ప్రాంతంలో దాన్ని స్వాధీనం చేసుకున్నారు . పూర్వాంచల్‌ ప్రాంతంలో హింస సృష్టిస్తామని, ఆ గందరగోళాన్ని ఆపండి అంటూ ఆ లేఖలో రాశారు.
 
మొత్తం మీద యూపీలో యోగి మార్కు పడింది. శరవేగంగా.. యూపీలోని ఫ్యూడల్ శక్తులకు ఏమాత్రం రుచించని మార్పులవి. అయితే ఇవెన్నాళ్లు కొనసాగుతాయనేదే సందేహం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదీ గొప్పదనం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి మా వద్ద గొప్పలు చెప్పొద్దు... మండిపడ్డ మంత్రి