Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాంటీ రోమియో స్క్వాడ్... గుట్కా నమిలితే దండన.. కొత్త సీసాలో పాత సారా... యూపీ సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ కేవలం మూడు రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా.. మహిళలను వేధించేవారి అకతాయిల భరతం పట్టేందుకు యాంటీ రోమియో స్క్వాడ్‌ను

Advertiesment
యాంటీ రోమియో స్క్వాడ్... గుట్కా నమిలితే దండన.. కొత్త సీసాలో పాత సారా... యూపీ సీఎం యోగి
, గురువారం, 23 మార్చి 2017 (08:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ కేవలం మూడు రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా.. మహిళలను వేధించేవారి అకతాయిల భరతం పట్టేందుకు యాంటీ రోమియో స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఆ వెంటనే ఈ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయడం, పలువురిని అరెస్టు చేయడం జరిగిపోయింది. 
 
మరోవైపు ప్రభుత్వ ఆఫీసుల్లో గుట్కా నమిలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవుల స్మగ్లింగ్‌పై నిషేధాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం ఉపేక్ష పనికిరాదని ఆదిత్యనాథ్‌ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా గోవధశాలల మూసివేతకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 
 
గోవధశాలల నిషేధంపై ఆదిత్యనాథ్‌.. ప్రజల అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకుంటున్నారు. ‘గోవధ నిషేధానికి కఠిన చట్టాలు అవసరమా?’ అని ఆయన అడిగారు. తన వ్యక్తిగత వెబ్‌సైట్‌ www.yogiadityanath.in ద్వారా తమ తమ అభిప్రాయాలు చెప్పాలని కోరారు. దీనికి స్పందించిన వారిలో 80 శాతం మంది కఠిన చట్టాలు కావాలని స్పష్టం చేశారు.
 
అయోధ్యలో రామాయణ మ్యూజియం నిర్మాణానికి 20 ఎకరాల స్థలం ఇచ్చేందుకు యోగి నిర్ణయించినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఫలితాలను నిలిపి వేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ చేపట్టారు. 
 
కాగా, మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం యోగి, హోం శాఖను తన వద్దే అట్టేపెట్టుకున్నారు. తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను తానే స్వయంగా పర్యవేక్షించనున్నారు. అలాగే, మైనింగ్ మాఫియాను అరికట్టేందుకు కూడా ఆ శాఖను ఎవరికీ కేటాయించకుండా తనవద్దే ఉంచుకున్నారు. 
 
అయితే, యోగి ఆదిత్యనాథ్ తీసుకునే నిర్ణయాలు గతంలో అమల్లో ఉండి కనుమరుగైపోయినవే. అందుకే యోగి తీసుకునే నిర్ణయాలను కొత్త సీసాలో పాత సారా అనే చందంగా ఉందని విపక్షాలు విమర్శలు చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ, పన్నీర్‌ వర్గాలకు ఈసీ షాక్‌... ఆర్కే.నగర్‌లో "రెండాకులు" చిహ్నం మాయం