యూపీలో మంత్రులుగా నేరగాళ్లు తప్ప దొరకరా? యోగి ఆదిత్యనాథ్ అంతపని చేశారెందుకు?
భాజపాలో క్లీన్ ఇమేజ్ కలిగిన నాయకుడిగా గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి వరుస విజయాల పరంపర రికార్డును సృష్టించిన నాయకుడుగా యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. అలాగే అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించారు. ఐతే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తన మం
భాజపాలో క్లీన్ ఇమేజ్ కలిగిన నాయకుడిగా గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి వరుస విజయాల పరంపర రికార్డును సృష్టించిన నాయకుడుగా యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. అలాగే అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించారు. ఐతే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తన మంత్రిమండలిలో 20 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వారిని మంత్రులుగా చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్ పాలనా పగ్గాల్లో నేర చరితులు కూడా భాగస్వామ్యం పంచుకోక తప్పదా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గతంలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా పలువురు మంత్రులు ఇలాగే నేర చరిత్రతో ప్రజలను బెంబేలెత్తించేశారు. అఖిలేష్ ఓడిపోవడంతో హమ్మయ్య అనుకున్నారు జనం. కానీ మరోసారి యోగి ఆదిత్యనాథ్ మంత్రుల్లో 20 మంది నేరగాళ్లు వున్నారన్న వార్త తెలియగానే యూపి ప్రజలు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. మరి యోగి ఆదిత్యనాథ్ దీనిపై పునరాలోచన చేస్తారో లేదో చూడాల్సి వుంది.