సంస్కారం కోసం దుస్తులు ధరిస్తున్నా.. దిగంబరంగానే ఉండేందుకు ఇష్టపడతా: రాందేవ్ బాబా
ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చునని యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు. మైసూర్ జిల్లా సుత్తూరు మఠంలో జరుగుతున్న ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ రకమైన ఆసనాలు వేస్తే
ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చునని యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు. మైసూర్ జిల్లా సుత్తూరు మఠంలో జరుగుతున్న ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ రకమైన ఆసనాలు వేస్తే ఏ రోగాలు నివారణ అవుతాయో ఆయన ప్రజలకు వివరించారు. ఈ మేరకు ఆయన యోగాసనాలు వేసి ప్రజలకు చూపారు. ప్రతిరోజూ కనీసం అరగంటపాటు యోగసనాలు వేయాలని ఆయన సూచించారు
అనంతరం రాందేవ్ బాబా మాట్లాడుతూ.. సాధువులు లోక సంక్షేమం కోసం పాటుపడుతారని.. తాను కూడా అదే దిశలో పనిచేస్తున్నానని ప్రకటించారు. ప్రజల ముందుకు సంస్కారం కోసం దుస్తుల్ని ధరిస్తున్నానని, లేదంటే దిగంబరంగానే ఉండేందుకు తాను ఇష్టపడతానని రాందేవ్ బాబా ప్రకటించారు.
ఇంకా బాబా రాందేవ్ యోగా గురించి మాట్లాడుతూ.. ప్రాణాయామాలు ఒబిసిటీ, అసిడిటీ, గర్భ సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, అలెర్జీ, ఆస్తమాలను దూరం చేస్తుందని చెప్పారు. వీటి ద్వారా ఏకాగ్రతను పెంచుకోవడంతో పాటు జ్ఞాపకశక్తి పెంపొందుతుందని.. ఆవేశం తగ్గుముఖం పడుతుందని బాబా చెప్పుకొచ్చారు.