Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

500 కిలోల నుంచి 175 కిలోలకు తగ్గిస్తే వద్దు పొమ్మంటుందా

అయిదు వందల కిలోల బరువున్న ఆ భారీ మహిళను అష్టకష్టాలుపడి భారతీయ వైద్యులు 175 కిలోల బరువుకు తగ్గించినా చిన్న అబిప్రాయభేదంతో మీవైద్యం ఇక చాలని ఆమె విదేసీ పయనానికి సిద్ధమైంది. వైద్యుల ట్రీట్‌మెంట్ కాదు అప్రోచ్ సరగా లేదని, నర్సులు అతి నిర్లక్ష్యంతో వ్యవహరి

Advertiesment
eman abdul atti
హైదరాబాద్ , బుధవారం, 3 మే 2017 (01:53 IST)
అయిదు వందల కిలోల బరువున్న ఆ భారీ మహిళను అష్టకష్టాలుపడి భారతీయ వైద్యులు 175 కిలోల బరువుకు తగ్గించినా చిన్న అబిప్రాయభేదంతో మీవైద్యం ఇక చాలని ఆమె విదేసీ పయనానికి సిద్ధమైంది. వైద్యుల ట్రీట్‌మెంట్ కాదు అప్రోచ్ సరగా లేదని, నర్సులు అతి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని అరోపణలు చేసిన ఆ భారీ సైజు మహిళ చెల్లెలు ఎట్టకేలకు తన అక్కను భారత్‌నుంచి తరలించడంలో కృతకృత్యురాలైంది. ప్రపంచంలో అత్యంత బరువైన మహిళగా గుర్తింపు పొందిన ఈజిప్టుకు చెందిన ఇమాన్‌ అబ్దుల్‌ అట్టి అబుదాబిలోని ఆసుపత్రికి మారనుంది. చికిత్స కోసం అట్టిని ప్రత్యేక కార్గో విమానం ద్వారా ముంబైలోని సైఫీ ఆసుపత్రికి వచ్చిన విషయం తెలిసిందే. అట్టికి పలుమార్లు బెరియాట్రిక్‌ ఆపరేషన్‌ నిర్వహించిన సైఫీ ఆసుపత్రి వైద్యులు ఆమె బరువును 500 కేజీల నుంచి 176 కిలోలకు తగ్గించారు.
 
 
అట్టి కుటుంబసభ్యులకు, ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్‌ మప్ఫాజల్‌ లక్డావాలాకు మధ్య విభేదాలు తలెత్తడంతో వైద్యం కోసం అట్టి సోదరి సెలీమ్‌ అబుదాబీలోని బుర్జీల్‌ ఆసుపత్రిని సంప్రదించారు. అట్టికి వైద్యం చేసేందుకు వారు అంగీకరించడంతో ఈజిప్టు ఎయిర్‌కు చెందిన ప్రత్యేక విమానం ఎయిర్‌బస్‌ 300లో అట్టిను అబుదాబి తరలించనున్నారు. ఈ సమయంలో ఐసీయూలో వినియోగించే అన్ని రకాల వస్తువులు, మెడిసన్లను విమానంలో అందుబాటులో ఉంచుకుంటామని బుర్జీల్‌ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. కాగా, వైద్య చికిత్స కోసం వస్తున్న అట్టీ, ఆమె సోదరికి యూఏఈ ప్రభుత్వం 90 రోజుల వీసాను మంజూరు చేసింది.
 
రోగి అభిప్రాయమే ఫైనల్ కాబట్టి ఆ ముంబై ఆసుపత్రి ఇన్ని నెలలుగా చేసిన శ్రమ అంతా వృధా అయిపోయింది. రోగి పట్ల వైఖరి, నిర్లక్ష్యమే ఆమె ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నందుకు కారణం అయితే భారతీయ వైద్యరంగం ప్రజాసంబంధాల గురించి చాలానే నేర్చుకోవలసి ఉంటుందేమో మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ మాట సీఎం చంద్రబాబు పట్టించుకుంటారా...?